Site icon NTV Telugu

Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?

Sarkaru Vaari Paata Censor

Sarkaru Vaari Paata Censor

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’పై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. విడుదలైన ప్రతీ పోస్టర్ ఎగ్జైట్ చేయడం, ముఖ్యంగా ట్రైలర్ ట్రైలర్‌లో వింటేజ్ మహేశ్ కనిపించడంతో.. ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మే 12వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.

ఇదిలావుండగా.. హైదరాబాద్‌లో యూసుఫ్‌గూడ‌లో శనివారం రాత్రి ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం, తాజాగా సెన్సార్ పనుల్ని ముగించుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 162 నిమిషాల 25 సెకన్లుగా తేలింది. ఈ సెన్సార్ రిపోర్ట్‌ని మేకర్స్ షేర్ చేస్తూ.. ‘‘మహేశ్ మెంటల్ మాస్ స్వాగ్‌ని వెండితెరపై చూస్తూ.. మీరు కురిపించే ప్రేమను ఆస్వాదించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. థియేటర్లలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంకండి’’ అని ట్వీట్ చేశారు.

కాగా.. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజ్, ఇంకా పేరుగాంచిన నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. తమన్ అందించిన సంగీతం ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. మే 12న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మహేశ్ అభిమానులకు రాసిన ఓ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. పోకిరి సమయంలోనూ మహేశ్ ఇలాంటి లేఖనే రాయడంతో, ఆ సినిమా తరహాలోనే సర్కారు వారి పాట బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Exit mobile version