Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’పై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. విడుదలైన ప్రతీ పోస్టర్ ఎగ్జైట్ చేయడం, ముఖ్యంగా ట్రైలర్ ట్రైలర్‌లో వింటేజ్ మహేశ్ కనిపించడంతో.. ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మే 12వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.
ఇదిలావుండగా.. హైదరాబాద్‌లో యూసుఫ్‌గూడలో శనివారం రాత్రి ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం, తాజాగా సెన్సార్ పనుల్ని ముగించుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 162 నిమిషాల 25 సెకన్లుగా తేలింది. ఈ సెన్సార్ రిపోర్ట్‌ని మేకర్స్ షేర్ చేస్తూ.. ‘‘మహేశ్ మెంటల్ మాస్ స్వాగ్‌ని వెండితెరపై చూస్తూ.. మీరు కురిపించే ప్రేమను ఆస్వాదించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. థియేటర్లలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంకండి’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్‌తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
- Toxic: సొంత గడ్డపైనే యశ్‌కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
- Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
కాగా.. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజ్, ఇంకా పేరుగాంచిన నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. తమన్ అందించిన సంగీతం ఆల్రెడీ బ్లాక్‌బస్టర్ అయ్యింది. మే 12న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మహేశ్ అభిమానులకు రాసిన ఓ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. పోకిరి సమయంలోనూ మహేశ్ ఇలాంటి లేఖనే రాయడంతో, ఆ సినిమా తరహాలోనే సర్కారు వారి పాట బ్లాక్‌బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
All set to embrace your immense love and support from May 12th 💝💫
Get ready to witness Super ⭐@urstrulyMahesh‘s MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️🔥
Bookings opening in a phased manner across the board 🤗#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQ
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022
తాజావార్తలు
-
Fake Currency : యూట్యూబ్ చూసి నకిలీ నోట్లు.. హైదరాబాద్‌లో బిగ్ గ్యాంగ్ గుట్టురట్టు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
-
Jeetendra Mishra: ఆపరేషన్ సిందూర్ హీరో.. రామ మందిర కొత్త సీఈఓ జితేంద్ర మిశ్రా ఎవరు.?
-
PM Kisan 24th Installment: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్‌లో రూ.2,000 బదులు రూ.4,000.. ఎవరికంటే..?
-
Kerala: ‘‘మహిళలు పబ్లిక్‌లోకి వస్తే విధ్వంసమే’’.. ముస్లిం మతపెద్ద వ్యాఖ్యలపై సీఎం ఫైర్
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!