“సర్కారు వారి పాట” బ్లాస్టర్ సూపర్ స్టార్ అభిమానులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న విడుదలైన “సర్కారు వారి పాట” బ్లాస్టర్ వీడియో ఇప్పటికీ హాట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఈ టీజర్ మహేష్‌ని అల్ట్రా స్టైలిష్ అవతార్‌లో చూపించి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా “సర్కారు వారి పాట” బ్లాస్టర్ మరో మైలు రాయిని దాటింది. “సర్కారు వారి పాట” బ్లాస్టర్ తాజాగా యూట్యూబ్ లో 40 మిలియన్లకు పైగా వ్యూస్, 1.1 మిలియన్లకు పైగా లైక్‌లను సాధించింది. పుష్ప (87M), రాధే శ్యామ్ (63M), అఖండ (57M) తర్వాత అత్యధికంగా వీక్షించిన 4వ టాలీవుడ్ టీజర్‌గా “సర్కారు వారి పాట” బ్లాస్టర్ నిలిచింది. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో #SVPBlasterHits40M అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
Read Also : “గని ఆంథమ్” సాంగ్ అదిరిపోయింది
“సర్కారు వారి పాట”లో మహేష్ బాబుకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ కు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. “సర్కారు వారి పాట” జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
