సూపర్ స్టార్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ “సర్కారు వారి పాట” నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటటైనర్ “సర్కారు వారి పాట” ఈ సంక్రాంతికే విడుదల కావాల్సింది. సినిమా విడుదల గురించి మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ‘సర్కారు వారి పాట’ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి నిర్మాతలు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేయనున్నారు.
Read Also : “అన్‌స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!
అయితే ఎట్టకేలకు ఈ చిత్రం ఆడియో ఆల్బమ్ నుండి మొదటి పాట విడుదల చేయబోతున్నారు. దీనిపై అధికారిక అప్డేట్ ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సమాచారం ప్రకారం జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ మొదటి పాటపై అధికారిక ప్రకటన విడుదల కానుంది. ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న తొలి పాటను విడుదల చేయనున్నామని రేపు అధికారిక ప్రకటన ద్వారా అదే విషయాన్ని “సర్కారు వారి పాట” టీం ధృవీకరించనున్నట్లు సమాచారం. మరి నిజంగా అదే జరుగుతుందో లేదో వేచి చూడాలి.
