Sarkaaru Noukari Trailer: సర్కారు నౌకరి అంటే కండోమ్స్ పంచడమా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarkaaru Noukari Trailer: సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. శేఖర్ గంగనమోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని RK టెలిషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆకాష్ సరసన భావన అనే కొత్త అమ్మాయి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సునీత కొడుకు మొదటి సినిమా అయినా కూడా తడబడకుండా నటించినట్లు తెలుస్తోంది. ఒక మారుమూల పల్లెటూరు లో ఈ కథ నడుస్తుంది అని కనిపిస్తుంది.
గోపాల్.. సర్కార్ మండల ఆఫీస్ లో పని చేస్తాడు. కొత్తగా పెళ్లి కావడంతో భార్యను తీసుకొని మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ గ్రామానికి వెళ్తాడు. అక్కడ అందరూ చదువుకొని గ్రామస్తులే.. వారికి ఏమి తెలియదు. ఇక ఆ ప్రజల జీవన విధానం చూసిన గోపాల్ కు వారిని మార్చాలి అని అనిపిస్తుంది. పిల్లలను కనడం.. సరిగ్గా పెంచకపోవడం.. చదివించలేకపోవడానికి కారణం.. వారికి కండోమ్స్ వాడకం గురించి తెలియకపోవడమే అని తెలుసుకొని.. ప్రజలకు కండోమ్స్ పంచుతూ ఉంటాడు. అసలు అవేంటో కూడా తెలియని ప్రజలు వాటిని బుగ్గలు అనుకోని వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఇక వాటి గురించి తెలుసుకొని.. గోపాల్ ను ప్రజలు అసహ్యించుకుంటారు. చివరికి భార్య కూడా .. ఆ నౌకరి కావాలా.. ? నేను కావాలా ? అని తేల్చుకోమనడం చూపించారు. ఇక చివర్లో సర్కారు నౌకరి అంటే జీతం తీసుకోవడం కాదు.. ప్రజలకు సేవ చేయడం అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సినిమాలో చాలా సున్నితమైన విషయాన్నీ ఎంతో అద్భుతంగా చూపించినట్లు తెలుస్తోంది. ఇక శాండిల్య పిసాపతి మ్యూజిక్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై హిప్ తెచ్చారు. ఇకపోతే ఈ సినిమా జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సునీత కొడుకు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Ram Charan: “విరాట్ అంటే ఫైర్.. ధోని అంటే కూల్”.. క్రికెట్ లెజెండ్స్‌పై చరణ్ క్రేజీ కామెంట్స్
- Mega Podcast: చిరంజీవి జీవితంలోని అరుదైన అనుభవాలు.. త్వరలో ‘మెగా పోడ్కాస్ట్’లో!
- Toxic: యష్ ఇచ్చిన హింట్‌తో సోషల్ మీడియాలో రచ్చ.. హీరోయిన్ల పాత్రలు ఇదేనా?
- Ram Charan : స్టార్ క్రికెటర్ బుమ్రాకు సారీ చెప్పిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
తాజావార్తలు
-
Yamaha Ethanol Bike: ఇథనాల్‌తో నడిచే యమహా బైక్ భారత్‌లోకి ఎప్పుడు? కంపెనీ కీలక ప్రకటన
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
-
IMD Rain Alert: మండే ఎండల్లో వాతావరణ శాఖ కూల్ అప్ డేట్.. వేగం పుంజుకున్న రుతుపవనాలు.. ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
-
Suryakumar Yadav: సూర్యకుమార్‌కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
-
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?