NTV Telugu Site icon

Ramaprabha: ఆయన హెల్ప్ చేశాడా.. ? ఎవరు చెప్పారు.. నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు

Rama

Rama

Ramaprabha: లేడీ కమెడియన్ గా పేరుతెచ్చుకున్న నటీమణుల్లో రమాప్రభ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ వయస్సులో కూడా ఆమె నటిస్తూ తన సొంత కాళ్ళ మీద బతుకుతుంది. ఇక సోషల్ మీడియాలో ఆమె గురించి రకారకాలుగా చెప్పుకొస్తున్నారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని కొన్నిసార్లు.. ఆర్థిక పరిస్థితి బాగోలేదని మరికొన్నిసార్లు.. శరత్ బాబు చావుకు కారణం ఆమెనని.. శరత్ బాబు ఆస్తి మొత్తం కొట్టేసిందని .. ఇలా రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తూ వస్తున్నాయి. ఇక తాజాగా రమాప్రభ వీటన్నింటికి సమాధానం చెప్పుకొచ్చింది. ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ ను రన్ చేస్తున్న విషయం తెల్సిందే. అందులో చాలా గ్యాప్ తరువాత ఆమె మాట్లాడింది. అప్పటికి, ఇప్పటికి రమాప్రభనే అని స్పష్టం చేసింది.

Kota Srinivasa Rao: స్టార్ హీరోలపై కోటా సంచలన వ్యాఖ్యలు.. అంతా సర్కస్ అంటూ

” నా గురించి ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వాటిని చూసి నవ్వుతాను.. ఇంకొన్నిసార్లు బాధపడతాను. ఈ మూడు నెలలో నేను ఒక చిన్న టూర్ కు వెళ్లి వచ్చాను. హైదరాబాద్, తిరుపతి, షిరిడీ, విజయవాడ .. ఇలా తిరుగుతూ వచ్చాను. వచ్చాకా నా గురించి వచ్చిన పుకార్లు చూసి షాక్ అయ్యాను. ఈ విధంగా నేను ఫేమస్ అవుతున్నాను. ఆ పుకార్లులో నా గురించి ఎక్కువ ఉన్నాయి కాబట్టి.. నేను వాటికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. చెన్నై లో నాకు ఒక ఇల్లు ఉంది.. అందులో చాలామంది ఉంటున్నారు. కానీ ఆ ఇల్లు రమాప్రభ ది అని మాత్రం ఎవరు చెప్పడం లేదు. ఎందుకో నాకు తెలియదు. ఇక నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు రజినీకాంత్ హెల్ప్ చేశాడని రాసుకొచ్చారు. అందులో కూడా నిజం లేదు. చిన్నతనం నుంచే నేను కష్టపడి బతకడం నేర్చుకున్నాను. ఇప్పుడు నా గురించి ఎవరికి వాళ్ళు నోటికి వచ్చింది వాడుతున్నారు” అని వాపోయింది. ఇక శరత్ బాబు చనిపోయాక కూడా ఆమెపై చాలామంది నిందలు వేశారు. శరత్ బాబు ఆస్తి కొట్టేసిందని, ఆమె వలనే శరత్ బాబ విడిపోవాల్సి వచ్చిందని ఏవేవో రాసుకొచ్చారు. ఇక వాటికి కూడా రమాప్రభ పరోక్షంగా సమాధానం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.