Site icon NTV Telugu

Saranya Pradeep: అంబాజీపేటలో హీరో సూహాస్ కాదు.. శరణ్యనే.. అసలు ఏమన్నా యాక్టింగా?

Saranya Pradeep

Saranya Pradeep

Saranya Pradeep getting huge applause for Ambajipeta Marriage Band: సుహాస్ శివాని హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుష్యంత్ కటికనేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ తో పాటు ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మించారు. నిజానికి ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి పెరిగింది. దానికి తోడు సినిమా నుంచి రిలీజ్ అయిన దాదాపు అన్ని పాటలు ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమా మీద అంచనాలు కూడా పెరిగాయి. ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అంతకు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఇక ఈ సినిమా చూసిన తర్వాత సినిమా బావుందని అందరి నోట వినిపిస్తోంది.

Niharika Konidela: RDX హీరోతో మెగా డాటర్ రీ ఎంట్రీ..

అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాలో సుహాస్ నటనని, అతని అక్కగా నటించిన పద్మ పాత్రతో శరణ్య ప్రదీప్ డామినేట్ చేసింది. నిజానికి ముందు నుంచి ఈ సినిమాకి హీరోగా సుహాసిని ప్రమోట్ చేస్తూ వచ్చారు. అయితే చివరిలో మాత్రమే ఈ సినిమాలో శరణ్య ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా ఉంటుందని చెప్పారు. నిజంగానే శరణ్య సినిమా మొత్తానికి ఆమెనే హీరోలా అనిపించేలా నటించింది. ఆమెలో ఇంత మంచి నటి దాగుందనే విషయం ఇప్పటివరకు మరుగున పడి ఉండటం బాధాకరం. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రతో ప్రేక్షకులందరికీ పరిచయమైన ఆమె భామాకలాపం లాంటి సినిమాలో కూడా మెరిసింది. కానీ ఈ సినిమాతో ఆమెలో ఉన్న నటిని బయటికి తీసుకురావడంలో సినిమా యూనిట్ సఫలం అయింది కచ్చితంగా ఈ సినిమా తర్వాత మీకు ఇలాంటి మరిన్ని సినిమాలు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు దొరుకుతాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Exit mobile version