NTV Telugu Site icon

Sapthami Gowda : నేను తప్పు చేశా.. నేను మధ్యలోకి రాను..సప్తమి గౌడ ఎమోషనల్ ఆడియో వైరల్!

Sapthami Gowda Yuva Rajkumar

Sapthami Gowda Yuva Rajkumar

Sapthami Gowda Audio Viral in Socia Media: కన్నడలో బిగ్గెస్ట్ సినిమా ఫ్యామిలీ అయిన డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల వార్తలు రావడం ఇదే తొలిసారి. రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ కుమారుడు యువరాజ్‌కుమార్‌ విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. విడాకుల నోటీసులో భార్య శ్రీదేవి భైరప్పపై యువరాజ్‌కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నోటీసుకు శ్రీదేవి భైరప్ప తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చారు. శ్రీదేవి భైరప్ప తన సమాధానంలో యువ రాజ్‌కుమార్ – సప్తమి గౌడ మధ్య ఎఫైర్‌ను పదేపదే ప్రస్తావించారు. సప్తమి గౌడ మరియు యువ ప్రేమలో ఉన్నారని, ఏడాది కాలంగా వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని శ్రీదేవి ఆరోపించింది. ఇదిలా ఉండగా ఈ రోజు సప్తమి గౌడకు చెందిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆడియోలో సప్తమి గౌడగా చెబుతున్న యువతి వాయిస్‘నా వైపు కథ వినండి.. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి.. నేను తప్పు చేశాను’ అంటూ ఏడుస్తూ వేడుకుంటున్నట్టు కనిపిస్తోంది.

Anasuya: జాకెట్ విప్పిన ప్రోమోపై ట్రోలింగ్స్.. ఇంకోసారి రిపీట్ చేయోద్దన్న నెటిజన్.. అనసూయ షాకింగ్ రిప్లై

అందుతున్న సమాచారం మేరకు ప్రకారం, ఇది దర్శకుడు లేదా నిర్మాతకి పంపబడిన ఆడియో అని అంటున్నారు. ఆమె ఆడియోలో ఉన్నదున్నట్టు మీకోసం. హాయ్ సార్, ఏం జరుగుతుందో మీకు ముందే తెలిసి ఉండాలి. నా వైపు కథ చెప్పే అవకాశం ఇవ్వండి. నేను ఏ తప్పూ చేయలేదని చెప్పడం లేదు. కచ్చితంగా నా తప్పు ఉంది. నేను కాదు అనడం లేదు. నేను మా అమ్మపై ప్రమాణం చేస్తున్నాను, బాబాపై ప్రమాణం చేస్తున్నాను… మీ భార్యను వదిలేసి నాతో రమ్మని నేనెప్పుడూ గురు(యువ రాజ్‌కుమార్‌)కి చెప్పలేదు. కావాలంటే అతణ్ని కూడా అడగవచ్చు’’ ఇది మీ సెట్‌లో జరిగింది. మాపై మీకు ఎంత కోపం వచ్చినా ఫర్వాలేదు సార్. నేను మాట్లాడనని మా ఇంట్లో కూడా వాగ్దానం చేశాను.” గురు (యువ రాజ్‌కుమార్)కి ఇది తొలి సినిమా. నాకు కూడా ముఖ్యం. సినిమా చేయడానికి అందరూ చాలా కష్టపడ్డారు. 100% నేను అందులో జోక్యం చేసుకోను సార్. నేను అలా చేయబోవడం లేదు. సార్, మిమ్మల్ని సంప్రదించవద్దని, ఏమీ చేయవద్దని చెప్పాను. ‘‘మీరు ఏమి చెప్పినా నేను అంగీకరిస్తా అంటూ ఆమె చెబుతున్న ఆడియో వైరల్ అయింది.