Site icon NTV Telugu

సప్తగిరి హీరోగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి సినిమా!

saptagiri

saptagiri

హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘యజ్ఞం’, ‘పిల్లా… నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేయబోతున్నాడు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఎ. ఎస్. రిగ్వేద చౌదరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ “వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సప్తగిరి నుంచి ప్రేక్షకులు ఆశించే వినోదంతో పాటు కొత్త కథ, కథనాలు ఉంటాయి. రవికుమార్ చౌదరి దర్శకత్వం సినిమాకు బలం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి” అని అన్నారు.

Exit mobile version