Sapta Sagaralu Dhaati Hero Rakshit Shetty Interview: కన్నడలో ఘన విజయం సాధించిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాను ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ‘అతడే శ్రీమన్నారాయణ’, ‘777 చార్లీ’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ నిర్మించిన ఈ సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కన్నడలో సూపర్ హిట్ అందుకుంది. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించగా ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో సెప్టెంబర్ 22న ఈ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో తెలుగు విలేకర్లతో ముచ్చటించిన రక్షిత్ శెట్టి పలు కీలక విషయాలు పంచుకున్నారు. దర్శకుడు హేమంత్ తో ఇది నాకు రెండో సినిమా అని తన మొదటి సినిమా ‘గోధి బన్న సాధారణ మైకట్టు’లో కూడా నేను నటించానని అన్నారు. తన రెండో సినిమా కూడా నాతో చేయాలి అనుకున్నా కానీ అప్పుడు నేను ‘అతడే శ్రీమన్నారాయణ’తో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని కానీ ఇప్పుడు మూడో సినిమాకి ఇలా కుదిరిందని అన్నారు.. దర్శకుడిగా హేమంత్ ది ఒక విభిన్న శైలి అని, అతని మొదటి రెండు సినిమాలకే కన్నడ పరిశ్రమకు మరో మంచి దర్శకుడు దొరికాడనిపించిందని అన్నారు. చిత్రీకరణకు ముందు ఈ సినిమాని ఎలా తెరకెక్కిస్తారా అనే ఆసక్తి ఉండేది కానీ ఆయన ఈ కథని పొయెటిక్ గా ఎంతో అందంగా రూపొందించారని అన్నారు.
Anasuya Bharadwaj: ‘రంగమ్మత్త’ను మర్చిపోతారంటున్న అనసూయ
మొదట రెండు భాగాలు అనే ఆలోచన లేదు అయితే షూటింగ్ సమయంలో ప్రధాన పాత్రలు మను-ప్రియ మధ్య కెమిస్ట్రీ చూసి హేమంత్ రెండు భాగాలుగా చెప్పాలి అనుకున్నారని అన్నారు. హేమంత్ బౌండెడ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉంటారు, ఏం చేయాలో క్లారిటీ ఉంటుంది అయినప్పటికీ షూటింగ్ సమయంలో ఇంకా ఏమైనా మెరుగు పరచగలమా అని ఆలోచిస్తూనే ఉంటారని అన్నారు. అలా కొంత భాగం షూటింగ్ అయ్యాక రెండు భాగాలుగా విడుదల చేయాలని ఆయన భావించారని అన్నారు.. మొదట నాకు కాస్త ఆందోళన కలిగినప్పటికీ.. కథ మీద, ఆయన విజన్ మీద నమ్మకంతో అంగీకరించానని షూట్ అయ్యాక ఎడిటింగ్ టేబుల్ లో చూసుకున్నాక రెండు భాగాలుగా చెప్పాలనే ఆయన ఆలోచన సరైనది అనిపించిందని అన్నారు. మామూలుగా మొదటి భాగం, రెండవ భాగం ఎక్కువ వ్యవధితో విడుదల చేస్తున్నారు కానీ మేము ఏడు వారాల వ్యవధిలోనే విడుదల చేస్తున్నాం కాబట్టి ప్రేక్షకులు కథతో, పాత్రలతో తేలికగా పయనిస్తారని అన్నారు. ఇది 2010 సమయంలో జరిగే కథ కావడంతో క్యాసెట్లతో ముడిపడి ఉంటుందని, అప్పుడు మనకు పాటల క్యాసెట్లు ఉండేవని అన్నారు. వాటిలో సైడ్-A, సైడ్-B అని ఉంటాయి, సైడ్-A పూర్తయిన తర్వాత సైడ్-B ప్లే చేస్తాం ఆ ఉద్దేశంతో ఇలా సైడ్-A, సైడ్-B అని పెట్టడం జరిగిందని అన్నారు.