NTV Telugu Site icon

Sapta Saagaradaache Ello Side B : సడన్ గా ఓటీటీ నుంచి మాయమైన ఎమోషనల్ మూవీ..

Whatsapp Image 2024 03 21 At 12.28.25 Pm

Whatsapp Image 2024 03 21 At 12.28.25 Pm

కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచె ఎల్లో సైడ్ ఏ మరియు సైడ్ బీ.. ఈ రెండు చిత్రాలు కన్నడలో మంచి విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, మరియు సైడ్-బీ గా విడుదల అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో మంచి కలెక్షన్లను దక్కించుకున్నాయి. గతేడాది నెలల వ్యవధిలో థియేటర్లలో రిలీజైన ఈ లవ్ ఎమోషనల్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ఈ రెండు చిత్రాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చాయి. అయితే, సప్త సాగరదాచె ఎల్లో సైడ్-బీ సినిమా సడెన్‍గా ఓటీటీలో మాయమైంది.సప్త సాగరదాచె ఎల్లో సైడ్-బీ సినిమా జనవరి 25వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలలకు ఈ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. చాలా ఆలస్యంగా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ సైడ్-బీ సినిమా ఆ ఓటీటీలో మాయమైంది.అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం సప్త సాగరదాచె సైడ్-ఏ సినిమా అందుబాటులో ఉన్నా.. సడెన్‍గా సైడ్-బీ మూవీ మిస్ అయింది. దీనిపై సోషల్ మీడియాలో కొందరు యూజర్లు పోస్టులు చేస్తున్నారు. సైడ్-బీ సినిమా ఎందుకు మిస్ అయిందని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రైమ్ వీడియో నుంచి ఈ విషయంపై ఇంకా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.సప్త సాగరదాచె ఎల్లో చిత్రాలకు హీరో రక్షిత్ శెట్టి నిర్మాతగానూ ఉన్నారు. సైడ్-ఏ, సైడ్-బీ చిత్రాల శాటిలైట్ హక్కులను జీ నెట్‍వర్క్ సొంతం చేసుకుంది. అయితే, సైడ్-బీ చిత్రాన్ని ‘జీ5’ ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.. ఈ విషయంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. అందుకే.. సైడ్-బీ మూవీ ప్రైమ్ వీడియోలో మిస్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం వుంది.