‘దంగల్’ చిత్రంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భామ సన్యా మల్హోత్రా. అమీర్ ఖాన్ రెండో కూతురిగా నటించిన ఈ భామకు ఈ సినిమా మంచి అవకాశాలనే తెచ్చిపెట్టింది. ఇటీవలే అమ్మడు నటించిన ‘మీనాక్షి సుందరేశ్వర్’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విజయాన్ని అందుకుంది. ఇక ఈ జోష్ లో ఉన్న ఈ భామ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది. “నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను.. నాలుగేళ్ళ రిలేషన్ తరువాత బ్రేకప్ అయ్యింది.. దాని తరువాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. ఈ బ్రేకప్ ఎంతో బాధని ఇస్తుంది.. విడిపోవడం కన్నా ఎక్కువ బాధ ఏది ఉండదు.. కానీ, మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయినవారి గురించి ఆలోచించడం వృథా.. అందుకే నేను వాటిని వదిలేసి నా హెల్త్ మీద, కెరీర్ మీద ఫోకస్ పెట్టాను.
ప్రస్తుతం నేను ముంబైలో ఒంటరిగా ఉంటున్నాను. కొన్ని విషయాలు ఎందుకు వర్క్ అవుట్ అవ్వవో నాకు ఇప్పటికి అర్ధం కాదు.. ఏదిఏమైనా 2020 నాకు ఎంమంచి జ్ఞాపకాలనే ఇచ్చింది.. ప్రేమ అనేది సెల్ఫ్ లవ్ కంటే గొప్పది కాదని అర్ధం అయ్యింది.. రిలాక్సేషన్ దొరికింది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడి బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.
