Santosh Sobhan Intresting Comments on abhishek maharshi: కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో సంతోష్ శోభన్ ఆసక్తికర సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన నటించిన ‘ప్రేమ్ కుమార్ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ అవుతోంది. రైటర్ అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. రాశీ సింగ్, రుచిత సాదినేని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ పరిచయ వేదిక కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగగగా ఈవెంట్‌లో హీరో సంతోష్ శోభన్, హీరోయిన్స్ రుచితా సాధినేని, రాశీ సింగ్, నిర్మాత శివ ప్రసాద్, దర్శకుడు అభిషేక్ మహర్షి, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.అనంత శ్రీకర్, కాసర్ల శ్యామ్, రైటర్ అనిరుద్ కృష్ణమూర్తి, యాక్టర్ ప్రభావతి, యాక్టర్ అశోక్ కుమార్, రోల్ రైడా, సింగర్ ధ్రువన్ వంటివారు పాల్గొన్నారు.
Keerthy Suresh: చిరంజీవి రియాక్షన్ సర్ప్రైజ్ చేసింది..మామూలు విషయం కాదు: కీర్తి సురేష్
ఈ క్రమంలో హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ నిజానికి నా సినిమాల్లో అభిషేక్ నటించాడు కానీ తను అప్పుడు డైరెక్టర్ అవుతాడని అనుకోలేదని పేర్కొన్నారు. ఈ సినిమా తర్వాత తనెంత మంచి డైరెక్టరో అందరికీ తెలుస్తుందని, భవిష్యత్తులో హ్యూమర్‌కి అభిషేక్ ఓ బ్రాండ్ అవుతాడని నమ్మకంగా ఉన్నానని అన్నారు. కామెడీ సినిమా చేయటం అంత గొప్ప విషయం కాదు కానీ తను గొప్పగా చేశాడని అన్నారు. శివ నిర్మాతగా 50 కాదు, 150 సినిమాలు చేయాలని కోరుకుంటున్నానఐ అన్నారు. రోల్ రైడా, ధ్రువన్, కాసర్ల శ్యామ్ ఇచ్చిన ధావత్ సాంగ్ చాలా బావుందని పేర్కొన్న ఆయన అలాగే సినిమాలో నటించిన నటీనటులకు, టెక్నీషియన్స్‌కు థాంక్స్ చెప్పారు. ఈ సినిమా మిమ్మల్ని రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా నవ్విస్తుందని ఆగస్ట్ 18న థియేటర్స్‌లో కలుద్దాం అని అన్నారు.