NTV Telugu Site icon

Venkatesh : ఏపిలో సంక్రాంతి వస్తున్నాం టికెట్ ధర పెంపు

Sankranthikivasthunam

Sankranthikivasthunam

 టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సంక్రాంతికి పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గోదారిగట్టు మీద రామ చిలకవే, మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.
Also Read : DaakuMaharaaj : ఏపీలో డాకు మహారాజ్ టికెట్ల ధరలు పెంపు
జనవరి 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. రిలీజ్ రోజు నుండి మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 అలాగే ముల్టీప్లెక్స్ లో రూ. 125 పెంచుతూ అనుమతులు ఇచ్చింది. ఈ పెంపుతో సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధర రూ. 245, రూ. 175 రూ. 302 గా ఉండనుంది. అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను ఈ నెల 6న రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ప్రమోషన్స్ లో పొంగల్ కు రాబోయే సినిమాలతో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం యూనిట్ దూసుకెళుతోంది.  ఇప్పటివరకు ప్రమోషన్ కంటెంట్ చూస్తే మరోసారి అనిల్ రావిపూడి, వెంకీ కాంబో ప్రేక్షకులకు నవ్వలు పువ్వులు పూయించేలా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది.
Show comments