NTV Telugu Site icon

Sankranthi Movies: ఎవరి టైం ఎంత? వర్కౌట్ అయ్యేనా?

Sankranthi Movies

Sankranthi Movies

ఈసారి సంక్రాంతి సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి నాలుగు సినిమాలు దూసుకొస్తున్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ వరుసగా థియేటర్లోకి రాబోతున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలు… అన్ని కూడా యు/ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకున్నాయి. ఇక ఈ సినిమాల రన్ టైం కూడా రివీల్ అయిపోయాయి. జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమా 159 నిమిషాలు… అంటే రెండు గంటల 39 నిమిషాల రన్ టైంతో థియేటర్లలోకి రానుంది. అదే రోజు రిలీజ్ కానున్న హనుమాన్ కూడా ఇంచు మించు ఇదే రన్‌ టైంతో రిలీజ్ అవుతోంది. రెండు గంటల 38 నిమిషాల నిడివితో రానుంది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈసినిమాలో తేజ సజ్జా హీరోగా నటించాడు.

ఇక వెంకీ మామ సైంధవ్ విషయానికి వస్తే… రెండు గంటల 20 నిమిషాల రన్ టైంతో జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఫైనల్‌గా జనవరి 14న రిలీజ్ కానున్న నాగార్జున నా సామిరంగ… రెండు గంటల 26 నిమిషాల రన్ టైం లాక్ చేసుకుంది. ఈ సినిమాకు కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వం వహించాడు. ఈ నాలుగు సినిమాల రన్ టైం చూస్తే… గుంటూరు కారం రన్ టైం ఎక్కువగా ఉంది. వెంకీ సైంధవ్ తక్కువ నిడివితో రాబోతోంది. ఈ సినిమాలన్నీ కూడా పర్ఫెక్ట్ రన్ టైంతోనే వస్తున్నాయి కాబట్టి… ఆడియెన్స్ సినిమా లెంగ్తీగా ఉందని ఫీల్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూస్తే… గుంటూరు కారం 125 కోట్లు… హ‌నుమాన్, సైంధ‌వ్ 25 కోట్లు… నాగార్జున నా సామిరంగ 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతున్నాయి.