ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కడ చూసిన అలియా- రణబీర్ ;ఆ పెళ్లి గురించే ముచ్చట. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ లవ్ బర్డ్స్ పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇక దీంతో బాలీవుడ్ ప్రముఖులు వీరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్.. అలియా- రణబీర్ లకు వీడియో ఆల్ లో విషెస్ చెప్పిన విషయం తెల్సిందే. ఇక తాజాగా ఈ జంటకు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఆశీర్వాదం అందించారు. సంజయ్ దత్ బయోపిక్ సంజూ లో రణబీర్ నటించిన సంగతి తెల్సిందే. సంజయ్ లా రణబీర్ నటన విమర్శకుల ప్రశంసలను అందుకున్న విషయం తెల్సిందే.
ఇక తాజాగా సంజయ్.. అలియా, రణబీర్ పెళ్లి గురించి మాట్లాడుతూ ‘ రణబీర్, అలియా పెళ్లి చేసుకుంటున్నారు అంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. అలియా నా కళ్లముందే పెరిగింది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు నమ్మకంతో.. ఎన్ని కష్టాలు వచ్చిన ఒకరికొకరు తోడుగా ఉంటామని, ఒకరికోసం ఒకరు కలిసే ఉంటామని చేసుకొనే ఒక ప్రామిస్. ఈ జంట ఎప్పుడు కలిసి ఉండాలని కోరుకుంటున్నాను.. అలియా.. త్వరగా పిల్లలను కూడా కనేయాలి’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ జంట పెళ్లి డేట్ చేంజ్ అయ్యిందని బాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఏప్రిల్ 20 న ఈ లవ్ బర్డ్స్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.
