ఒకప్పటి బాలీవుడ్ డ్రీమ్ బాయ్ సంజయ్ దత్‌ను కొత్తగా ప్రజెంట్ చేశాయి కేజీఎఫ్ సిరీస్ చిత్రాలు. కేజీఎఫ్ వన్ అండ్ టూలో నెగిటివ్ రోల్స్‌లో ఇరగదీశాడు సంజూ. ఇక అక్కడ నుండి సౌత్ ఇండస్ట్రీలో కూడా బిజీ స్టార్‌గా మారిపోయాడు మున్నాభాయ్. తమిళ్, తెలుగు, కన్నడ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొట్టేస్తున్నాడు. అలాగే ఛాన్స్ వచ్చినప్పుడల్లా బీటౌన్‌లో హీరోగానూ తన ప్రయత్నాలు కంటిన్యూ చేస్తున్నాడు.
Also Read : DACOIT : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటుడు
ప్రజెంట్ సంజయ్ దత్ ఖాతాలో అరడజను సినిమాలున్నాయి. అయితే ఇవన్నీ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రాలు. కాగా, ఇప్పుడు సరికొత్త జోనర్ లోకి ఎంటరయ్యాడు. నార్త్ బెల్ట్‌లో ప్రజెంట్ ట్రెండీగా నిలుస్తోన్న హారర్ కామెడీ జోనర్‌లో సినిమా చేస్తున్నాడు. ద భూత్నీ అనే మూవీలో నటిస్తున్నాడు. రీసెంట్లీ మూవీ అనౌన్స్ మెంట్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగిని ఫేం మౌనీరాయ్ దెయ్యంగా కనిపించబోతుంది. భూతాలపై యుద్దం చేసే యోధుడిగా స్టైలిష్ లుక్కులో మెస్మరైజ్ చేశాడు సంజూ. సన్నీసింగ్, పలక్ తివారీ, ఆసిఫ్ ఖాన్ కీ రోల్స్ చేస్తోన్న ది భూత్నీ ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హార్రర్ కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నాడు సిద్దాంత్ సచ్ దేవ్. ఇక ఇవే కాకుండా కేడీ అనే కన్నడ మూవీలో, బాప్, వెల్కమ్ టూ ది జంగిల్, బాగ్ 4తో పాటు ఓ పంజాబీ చిత్రంలో నటిస్తున్నాడు మున్నాభాయ్. మొత్తానికి సౌత్, నార్త్ బెల్ట్ చుట్టేస్తోన్న సంజూ.. న్యూ జోనర్ ది భూత్నీతో ఎంటర్ టైన్ చేస్తాడో లేదో రెండు నెలల్లో తెలుస్తుంది.