Site icon NTV Telugu

Sanjana Galrani: చెల్లి పెళ్లి అయ్యింది.. అక్క తల్లి అయ్యింది

Galrani Sisters

Galrani Sisters

కోలీవుడ్ లో ప్రస్తుతం గల్రాని సిస్టర్ గురించే చర్చ జరుగుతోంది. ‘బుజ్జిగాడు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సంజన గల్రాని.. ఈ సినిమా తరువాత అడపాదడపా తెలుగులో కనిపించిన ఈ అమ్మడు డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఇక అక్కతో పాటే తాను అనుకుంటా కోలీవుడ్ లో అడుగుపెట్టింది నిక్కీ గల్రాని.. తెలుగులో స్ట్రైట్ హీరోయిన్ గా నటించకపోయినా డబ్బింగ్ సినిమాలు ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాలతో ప్రేక్షకులను దగ్గరయింది. ఆ తరువాత నిక్కీ కూడా తన అక్క ఏ తప్పు ఎరుగదని, కావాలనే తనను ఇరికించారని చెప్పి ఆమె కూడా కొన్ని రోజులు మీడియా ముందు కనిపించింది.

ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ అక్కాచెలెళ్ళు ఒకే రోజు అభిమానులకు రెండు శుభవార్తలు తెలిపారు. నిన్ననే నిక్కీ,  యంగ్ హీరో ఆదిని పెళ్ళాడి కొత్త జీవితాన్ని మొదలు పెట్టగా.. సంజన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 2020 లాక్‌డౌన్‌ సమయంలో బెంగళూరుకు చెందిన అజీజ్‌  పాషా అనే వైద్యుడిని వివాహం చేసుకునం సంజన.. కొత్త వారసుడును తమ జీవితాల్లోకి ఆహ్వానించింది. దీంతో ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version