Sangeeth Sobhan: పుట్టినరోజున డబుల్ సర్ప్రైజ్.. సంగీత్ శోభన్ రెండు కొత్త సినిమాల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sangeeth Sobhan: ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ విజయాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించిన సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు డబుల్ ట్రీట్ లభించింది. ఒకవైపు షైన్ స్క్రీన్స్ బ్యానర్లో మిస్టరీ థ్రిల్లర్ కామెడీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, మరోవైపు ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌తో చేస్తున్న కొత్త సినిమాకు సంబంధించిన తొలి లుక్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఒకే రోజున రెండు కొత్త ప్రాజెక్టులు ప్రకటించడంతో సంగీత్ శోభన్ కెరీర్లో ఇది ప్రత్యేకమైన ఘట్టంగా మారింది. మొదటగా షైన్ స్క్రీన్స్ తమ 15వ నిర్మాణంగా సంగీత్ శోభన్ హీరోగా ఓ కొత్త సినిమాను ప్రకటించింది. ఈ చిత్రానికి ప్రణయ్ రావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ‘సాహో’ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన, ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించారు. ఇప్పుడు పూర్తిస్థాయి దర్శకుడిగా తొలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం మిస్టరీ థ్రిల్లర్, కామెడీ ఎలిమెంట్స్ కలగలిపిన వినోదాత్మక కథగా రూపొందుతోంది. సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సాహు గరపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదిలా ఉండగా మరో ఆసక్తికరమైన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న (ప్రొడక్షన్ నెం. 3) సినిమాలో సంగీత్ శోభన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు విడుదల చేసిన పోస్టర్లో సంగీత్ శోభన్ ‘మారుతి’ అనే పల్లెటూరి యువకుడి పాత్రలో కనిపించారు. పోస్టర్ లుక్ అయితే బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తోంది. సంగీత్, అనస్వర కాంబినేషన్ కొత్తదనం తీసుకురానుండగా, కథకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం చిత్రబృందం గోప్యంగా ఉంచింది. టైటిల్ గ్లింప్స్‌ను ఆగస్టు 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్, విజిబి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సంగీత్ శోభన్ ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌కు ‘మారుతి’ పాత్ర చక్కగా సరిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగీత్ శోభన్ ఇప్పుడు ఒకేసారి విభిన్న జానర్లలో సినిమాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఒకవైపు మిస్టరీ థ్రిల్లర్ కామెడీ, మరోవైపు గ్రామీణ నేపథ్యంలో వినోదాత్మక కథతో వస్తున్న ఈ రెండు ప్రాజెక్టులు ఆయన కెరీర్లో కొత్త మలుపు తీసుకురావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆగస్టు 23న విడుదల కానున్న టైటిల్ గ్లింప్స్‌తో పల్నాటి సూర్య ప్రతాప్ (ప్రొడక్షన్ నెం. 3) సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి.
- Tags
- cinema
- Sangeeth Sobhan
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు