Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anta Ramuloru Chooskuntaru: యంగ్ హీరో సంగీత్ శోభన్, మాలీవుడ్ బ్యూటీ అనశ్వర రాజన్ తొలిసారి జంటగా కనిపించబోతున్న సినిమాకు ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే కొత్త టైటిల్, గ్లింబ్స్ తో సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కొత్త సినిమా ఇప్పటికే సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ కాంబినేషన్‌తో బజ్ ఏర్పడింది. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను వినగానే గోదావరి యాస, అక్కడి పల్లెటూరి వాతావరణం, మనుషుల మధ్య ఉండే ఆప్యాయత గుర్తొచ్చేలా కనిపిస్తోంది. గ్లింబ్స్ ను చూస్తే ఒక ఫీల్ గుడ్ డ్రామాగా కనిపిస్తోంది.
అయితే ఇందులో ప్రధానంగా కనిపించబోయేది ప్రేమకథ కాదని చెబుతున్నారు. హీరో, హీరోయిన్ మధ్య జరిగే ఒక అందమైన కథ నడుస్తుందని తెలుస్తోంది. వీళ్లిద్దరి మధ్య ఉండే బంధం ఎలా మొదలవుతుంది, ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది సినిమా చూసిన తర్వాతే పూర్తిగా అర్థమయ్యేలా కథను రూపొందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి ప్రాంతాన్ని నేపథ్యంగా ఎంచుకోవడం సినిమాకు మరో ప్రత్యేకత. గోదావరి జిల్లాల పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల జీవనశైలి, మాట తీరు, సంబంధాలు, భావోద్వేగాలను తెరపై సహజంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
Also Read
ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఫీల్ గుడ్ కథలకు తన సంగీతంతో ప్రత్యేకమైన వాతావరణం తీసుకురావడంలో పేరున్న మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు అందించే పాటలు, నేపథ్య సంగీతం కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య సాగే కథకు మ్యూజిక్ మరింత అందాన్ని తీసుకొచ్చేలా ఉంటుందని చిత్రబృందం భావిస్తోంది. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, విజిబి ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని కలిసి నిర్మిస్తున్నారు. కథకు తగ్గట్టుగా మంచి నటీనటులను కూడా తీసుకున్నారు. రావు రమేష్, రోహిణి, రఘుబాబు, అలీ, ఝాన్సీ, వినోద్ కుమార్, శివనారాయణ, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
సంగీత్ శోభన్ ఇప్పటికే తన సినిమాలతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరోవైపు అనశ్వర రాజన్ మలయాళ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ కొత్త జోడీపై కూడా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ లవ్ స్టోరీలా కాకుండా భిన్నమైన కథతో వస్తున్నామని మేకర్స్ చెబుతుండటంతో సినిమా ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ మరింత పెరిగింది.
ఇప్పటివరకు సినిమా విడుదల తేదీని మాత్రం చిత్రబృందం ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్‌తో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్‌తోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘అంత రాములోరు చూస్కుంటారు’ నిజంగానే ప్రేమకథకు భిన్నమైన అనుభూతిని ఇస్తుందా? గోదావరి నేపథ్యంలో సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.
- Tags
- cinema
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!