NTV Telugu Site icon

Sandeep Reddy Vanga: ముందు రష్మిక పాత్ర ఆ హీరోయిన్ చేసింది.. కానీ, నాకే నచ్చలేదు

Rash

Rash

Sandeep Reddy Vanga: ఏ సినిమాలో అయినా.. పాత్ర ఎలా ఉండాలి.. ఆ పాత్రలో ఎవరు అంటించాలి అనేది డైరెక్టర్ కథను రాసుకొనేటప్పుడే ఉహించుకుంటాడు. ఇక కొన్నిసార్లు ఆ పాత్రలో నటించేవారు మారినప్పుడు హిట్ అయితే .. ఆ పాత్ర వారికోసమే పుట్టింది అంటారు.. ప్లాప్ అయితే ముందు అనుకున్నవారితోనే తీసి ఉంటే బావుండు అనుకుంటారు. ప్రస్తుతం యానిమల్ సినిమాలోని రష్మిక పాత్ర గురించి సందీప్ రెడ్డి వంగా ఛాయిస్ కరెక్ట్ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. రణబీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. డిసెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాపై సందీప్ రెడ్డి చెప్పిన ప్రతి మాట నిజమే.. ప్రతి ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి నిసక్కోచంగా మాట్లాడిన తీరు ఆకట్టుకుంటుంది. సినిమా కథ 3 గంటలకు పైగా ఉన్నా కూడా రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. చెప్పినట్లే చేశాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో రష్మిక పాత్రలో మరో హీరోయిన్ ను అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అనుకోవడమే కాదు షూటింగ్ కూడా జరిగిందంట. కానీ, ఆ పాత్రకు ఆమె న్యాయం చేయలేకపోవడం ఏమో కానీ.. సందీప్ కు నచ్చక ఆమెను వద్దు అని రష్మికను తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ హీరోయిన్ ఎవరో కాదు పరిణితీ చోప్రా.

” నేను గీతాంజలి పాత్రకు ముందు పరిణితీ చోప్రాను తీసుకున్నాను. షూటింగ్ కూడా జరిగింది. చివర్లో అవుట్ ఫుట్ చూసాకా.. నాకు నచ్చలేదు. ఇంకా ఏదో కావాలి అనిపించింది. అంటే పరిణితీ బాగా నటించలేదు అని కాదు. కానీ.. నాకే గీతాంజలిగా ఆమె సెట్ కాలేదని అనిపించింది. అందుకే ఆమెకు చివర్లో షూటింగ్ ఉన్నా కూడా చెప్పేసాను. ఆమె కూడా ఎంతో హుందాగా ఓకే అని చెప్పింది. ఆ తరువాత ఆ ప్లేస్ లో రష్మికను తీసుకున్నాం. పరిణితీ ఫీల్ అవుతుంది అని నేను ఆలోచించలేదు.. నా కథకు అన్ని కరెక్ట్ గా ఉండాలని అనుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. అలా ఈ సినిమాలోకి నేషనల్ క్రష్ ఎంట్రీ ఇచ్చింది. ఏదిఏమైనా గీతాంజలి పాత్రలో రష్మిక జీవించింది అని చెప్పాలి. మరి ఈ సినిమా ముందు ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.