Site icon NTV Telugu

Sandeep Reddy Vanga: జావేద్ అక్తర్ కి ఇచ్చి పడేశాడు.. నన్ను అనే ముందు నీ కొడుకు చేసిన మీర్జాపూర్ చూడు!

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga Counter to Javed Akhtar’s Animal comments: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమాలో రణబీర్ కపూర్ పోషించిన రణ్ విజయ్‌ పాత్ర విషపూరితమైన పురుషత్వాన్ని ప్రేరేకిస్తోంది అంటూ చాలా విమర్శలు వచ్చాయి. రచయిత జావేద్ అక్తర్ సైతం ఇలాంటి సినిమాలను ప్రమాదకరం అని అన్నారు. అయితే తాజాగా ఈ కామెంట్స్ మీద సందీప్ ప్రతిస్పందిస్తూ, అక్తర్ తన సినిమాపై వేళ్లు చూపించే ముందు తన కొడుకు ఫర్హాన్ అక్తర్ చేసే కంటెంట్ ను కూడా పర్యవేక్షించాలని కోరారు. సిద్ధార్థ్ కన్నన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, సందీప్ మాట్లాడుతూ, “ఆయన సినిమా చూడలేదని చాలా స్పష్టంగా ఉంది. ఆ కామెంట్‌లో తను సినిమా మొత్తం చూడలేదని చాలా క్లియర్‌గా ఉంది. ఇప్పుడు ఎవరైనా సినిమా చూడకుండా మాట్లాడితే వారి గురించి ఏం చెప్పాలి? ఆయన సినిమా చూడలేదు, ఆయన మాత్రమే కాదు, ఒక కళాఖండంపై రాళ్ళు విసురుతున్న ఎవరైనా, వారు ముందుగా తమ పరిసరాలను ఎందుకు తనిఖీ చేసుకోరు అని సందీప్ ప్రశ్నించాడు.

Daksha Nagarkar: మీ తొడలకి పెద్ద ఫ్యాన్, సీక్రెట్ ఏంటో చెప్పమన్న నెటిజన్.. దిమ్మతిరిగే షాకిచ్చిన హీరోయిన్

మీర్జాపూర్‌ని నిర్మిస్తున్నప్పుడు అదే విషయాన్ని తన కుమారుడు ఫర్హాన్ అక్తర్‌కి ఎందుకు చెప్పలేదు.? అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచంలో ఉన్న బూతులు అన్నీ మీర్జాపూర్ లోనే ఉన్నాయి, ఆ దెబ్బకు నేను మొత్తం షో కూడా చూడలేదు. ఆ షో తెలుగులోకి అనువదించబడినప్పుడు, మీరు దానిని చూస్తుంటే, మీకు బూతులతో పుక్కిలించినట్లు అనిపిస్తుంది. అతను తన కొడుకు పనిని ఎందుకు చెక్ చేయడం లేదు? అని సందీప్ ప్రశ్నించారు. జావేద్ అక్తర్ ఇటీవల యానిమల్ సినిమా గురించి మాట్లాడుతో ” ఒక పురుషుడు స్త్రీని తన షూ నాకమని లేదా ఒక వ్యక్తి స్త్రీని చెంపదెబ్బ కొట్టడానికి ఓకే చెప్పినా ఆ సినిమా సూపర్ హిట్ అయితే అది ప్రమాదకరం అని అన్నారు. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తూ సందీప్ ఈమేరకు కామెంట్లు చేశాడు.

Exit mobile version