Spirit : మోస్ట్ వెయిటెడ్ మూవీల లిస్టులో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా మూవీ ఉంటుంది. ఈ మూవీ ఇంకా మొదలు కాక ముందే ఎన్నో రూమర్లు దీనిపై వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ విషయంలో అయితే రకరకాల పేర్లు వినిపించాయి. మొదట్లో దీపిక పదుకొణె పేరు వినిపించింది. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆమె కాదు వసంత రుక్మిణి అన్నారు. ఈ రూమర్లన్నీ ఎందుకులే అని డైరెక్టర్ సందీప్ స్వయంగా త్రిప్తి డిమ్రి తమ హీరోయిన్ అని ప్రకటించేశాడు. ఇక్కడే సందీప్ వదిలిన ఓ పోస్టర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సందీప్ చేసిన మొట్టమొదటి పోస్టర్ ఇది.
Read Also : Thug life : విశాఖలో థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
ఇందులో త్రిప్తి డిమ్రి పేరును తొమ్మిది భాషల్లో ప్రకటించాడు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో ఆమె పేరు ఉంది. అంటే తొమ్మిది భాషల్లో ఈ మూవీని తీస్తున్నారని అర్థమైపోతోంది. ఈ మూవీని పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అన్ని రకాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ కు ఆల్రెడీ ఇండియాలో అన్ని భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అటు అమెరికా, జపాన్ లో కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇప్పుడు చైనీస్, కొరియన్ భాషల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ బేస్ ను పెంచేందుకు అక్కడి భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు హీరో, హీరోయిన్ అప్డేట్లు తప్ప ఇంకేదీ బయటకు రాలేదు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
Read Also : Tej Pratap Yadav: 12 ఏళ్ల రిలేషన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన లాలూ పెద్ద కొడుకు..
