యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతున్న ఈ చిత్రంలో కథానాయికగా నటించిన సంయుక్త, సినిమా విశేషాలను పంచుకోవడానికి మీడియా ముందుకు వచ్చారు. ఆ ముచ్చట్లు ఆమె మాటల్లోనే
సంక్రాంతి సందడి.. క్లీన్ కామెడీ!
సంక్రాంతి పండుగ వేళ తన సినిమా విడుదల కావడం పట్ల సంయుక్త ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. “పెద్ద పండుగ రోజున వస్తున్న ఈ చిత్రం ఒక స్వచ్ఛమైన వినోదాన్ని పంచే ‘క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్’. సంక్రాంతికి కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది ఒక పర్ఫెక్ట్ మూవీ” అని ఆమె పేర్కొన్నారు.
ట్రయాంగిల్ లవ్ స్టోరీ కథ కాదు.. వెరీ యూనిక్!
ఇద్దరు హీరోయిన్లు (సంయుక్త, సాక్షి వైద్య) అనగానే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అందరూ అనుకుంటారని, కానీ ఇందులో దర్శకుడు ఒక సరికొత్త పాయింట్‌ను టచ్ చేశారని సంయుక్త వెల్లడించారు. తన పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉందని, ముఖ్యంగా సిట్యుయేషనల్ కామెడీ బాగా వర్కౌట్ అయిందని చెప్పారు. ఈ సినిమాకు తన సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నానని, సినిమా చూస్తున్నంత సేపు తాను కూడా ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపారు.
Also Read:Vidyut Jammwal : ఒంటిపై నూలు పోగు లేకుండా చెట్టెక్కిన స్టార్ హీరో
శర్వానంద్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్
శర్వానంద్ గురించి మాట్లాడుతూ.. “ఆయన అద్భుతమైన టైమింగ్ ఉన్న నటుడు. షూటింగ్ సమయంలో నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చేవారు. అలాగే సీనియర్ నటులు నరేష్ గారు, సత్య గారి పాత్రలు కూడా కడుపుబ్బ నవ్విస్తాయి” అని పేర్కొన్నారు. దర్శకుడు రామ్ అబ్బరాజు చాలా క్లారిటీ ఉన్న వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ ఒత్తిడికి లోనుకాకుండా చాలా కూల్ గా పని పూర్తి చేస్తారని ప్రశంసించారు.
సంయుక్త తన కెరీర్ లో వైవిధ్యమైన పాత్రలు చేయడానికే ఇష్టపడతానని చెప్పారు. 2025లో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో నటించడం ఒక మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని, ఆ షూటింగ్ ప్రాసెస్ ను ఎంతో ఎంజాయ్ చేశానని వివరించారు. తన తదుపరి చిత్రం ‘బ్లాక్ గోల్డ్’ ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి కావచ్చని అప్డేట్ ఇచ్చారు. భవిష్యత్తులో బయోపిక్స్ లో నటించాలని, మరిన్ని కామెడీ పాత్రలు చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నమ్మే సంయుక్త, సంక్రాంతి పండుగను అందరితో కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నారు. ‘నారి నారి నడుమ మురారి’ నిర్మాత అనిల్ సుంకర గారికి ఈ సినిమా ఒక పెద్ద విజయాన్ని అందించాలని ఆమె కోరుకున్నారు.
