NTV Telugu Site icon

Samyuktha Menon: పీకల్లోతు ప్రేమలో టాలీవుడ్ హీరోయిన్.. సైలెంటుగా పెళ్లి?

Samyuktha Menon

Samyuktha Menon

Samyuktha Menon to marry her boy friend this year: సంయుక్త మీనన్ గురించి తెలుగు వారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ మధ్యనే మన తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైనా అతి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లలో ఆమె కూడా ఒకటి.. ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న బింబిసార, సార్, విరుపాక్ష, డెవిల్ సినిమాలలో నటించింది. ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా హిట్ అవ్వడంతో నిర్మాతలు క్యూ కడుతున్న క్రమంలో తెలుగుతో పాటు తమిళ్ చిత్రాల్లో కూడా నటిస్తోంది. క్రేజ్ పెరిగే కొద్దీ హీరోయిన్ పై రూమర్స్ కూడా పెరుగుతుంటాయి. అలాగే సంయుక్త మీనన్ పై కూడా రీసెంట్ ఒక రూమర్ సోషల్ మీడియా లో ప్రచారంలోకి వచ్చింది. నిజానికి తెలుగు సహా తమిళంలో వరుస సినిమాలు ఒప్పుకుంటూ వచ్చిన ఆమె ప్రస్తుతం వేగం తగ్గించింది.

Pushpa 2: పుష్పగాడు దిగుతున్నాడా? లేదా?

వ్యక్తిగత కారణాల వల్ల ఆమె కొత్త సినిమా ప్రాజెక్టులకు కమిట్ అయ్యే విషయంలో వెనకడుగు వేస్తోంది అని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సంయుక్త ప్రస్తుతం తన స్నేహితుడితో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌లో ఉందని అంటున్నారు. ఇక ఈ ఏడాది ఆమె, తన ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో సంయుక్త పెళ్లి చేసుకోనుందని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే పెళ్లికి సన్నాహాలు మొదలు పెట్టిందని అంటున్నారు. ఇక 28 ఏళ్ల వయసున్న ఈ నటి “భీమ్లా నాయక్” సినిమాతో తెలుగులో ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకుంది. ఇక నిజానికి ఆమె మలయాళీ కావడంతో ముందు నుంచే అనేక మలయాళ చిత్రాలలో నటించింది.