Samyuktha Menon : డెవిల్ సినిమాతో సంయుక్త మరో హిట్ అందుకుంటుందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంయుక్త మీనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగులో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త మీనన్. ఆమె నటించిన వరుస సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను కూడా సాధించాయి.దీంతో ఆమె నటిస్తే ఆ సినిమా హిట్ ఖాయమనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ మలయాళ భామ తెలుగులో తొలిసారి భీమ్లానాయక్ సినిమాలో రానా సరసన నటించిన విషయం తెలిసిందే.. ఆ సినిమా తెలుగులో సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.. వచ్చిన అన్ని సినిమాలను ఒప్పుకోకుండా కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేస్తుంది ఈ భామ.అలా కెరీర్ పరంగా జాగ్రత్తగా ఉండటం తో ఆమె నటించిన సినిమాలు హిట్ అవుతున్నాయి.
భీమ్లా నాయక్ సినిమా తర్వాత ఈ భామ కళ్యాణ్ రామ్ సరసన బింబిసార చిత్రంలో నటించింది. ఆ సినిమా కూడా ఘన విజయం సాధించింది. ఆ తరువాత ఈ భామ తమిళ్ స్టార్ హీరో ధనుష్ సరసన సార్ సినిమాలో నటించింది.ఈ సినిమా తమిళ మరియు తెలుగు ఇండస్ట్రీలలో మంచి హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాలో కూడా నటించింది. విరూపాక్షా సినిమాలో ఆమె నటనకు అంతా ఫిదా అయ్యారు. ఆ సినిమా భారీ వసూళ్లను సాధించింది.. ప్రస్తుతం ఈ భామ కళ్యాణ్ రామ్‌తో మరో సినిమా లో నటిస్తుంది..ఆ సినిమానే డెవిల్… కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా బుధవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.ఈ టీజర్ చూసిన తర్వాత సంయుక్త ఖాతాలో మరో హిట్ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ఆమె లుక్ కూడా అందరినీ బాగా ఆకట్టుకునేలా ఉంది. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాతో మరో భారీ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?