Samyukta Menon: భీమ్లా నాయక్ చిత్రంతో ఒక్కసారిగా అందరిని దృష్టిని ఆకర్షించింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. ఈ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి స్పెషల్ గా మాట్లాడి పవన్ అభిమానులకు మరింత చేరువైంది. ఇక ఈ సినిమా తరువాత తెలుగులో బింబిసార లో కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. మరోపక్క ధనుష్ సరసన సార్ సినిమాలో నటిస్తోంది. వరుస అవకాశాలను నడుకున్న ఈ ముద్దుగుమ్మపై కొన్నిరోజులుగా రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. భీమ్లా నాయక్ తరువాత సంయుక్త నటనకు మెచ్చి త్రివిక్రమ్, మహేష్ తో తెరకెక్కిస్తున్న సినిమాలో ఆమెనే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ వార్తలపై సంయుక్త స్పందించింది. ఆ వార్తలో నిజం లేదని, తన వద్దకు ఎలాంటి ఆఫర్ రాలేదని చెప్పుకొచ్చింది. ఇక సార్ షూటింగ్ లో సంయుక్త, ధనుష్ మధ్య గొడవ జరిగిందని, ఆమె షూటింగ్ మధ్యలోనే సెట్స్ నుంచి వెళ్లిపోయినట్లు కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై ఈ బ్యూటీ మాట్లాడుతూ ఈ వార్తలో కూడా నిజం లేదని తేల్చి చెప్పింది. ధనుష్ తో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎంతో గొప్ప నటుడని చెప్పుకొచ్చింది. “అదంతా అబద్దం.. ఇలాంటి రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారో నాకు తెలియదు. అలాంటి క్రియేటివిటీ చేయడం వారికే సాధ్యం. వాళ్ళ సృజనాత్మకకు సెల్యూట్ చేయాలి” అంటూ కౌంటర్ వేసింది. ఇక సంయుక్తనే నోరు విప్పడంతో ఆ రూమర్స్ కు చెక్ పడినట్లయింది. మరి ఈ ముద్దుగుమ్మ బింబిసార తో ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.
