NTV Telugu Site icon

Bro Movie: షూటింగ్ అయ్యేవరకు పవన్ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు

Bro

Bro

Bro Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా కోలీవుడ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రో. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా జూలై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం .. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటుంది. కాగా, తాజాగా డైరెక్టర్ సముద్రఖని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఇక రీమేక్ తెరకెక్కించడంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆయన తెలిపాడు. ” ఈ కథని అన్ని భాషలకు చేరువ చేయాలి. 12 భాషల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నాము. వినోదయ సిత్తం చేయకముందు, తర్వాత ఏంటి అనే దానిపై స్పష్టత లేదు. వినోదయ సీతాం చేశాక జీవితంలో సగం సాధించామనే భావన కలిగింది. ఇక ఇప్పుడు బ్రో చేశాక ఇంతకంటే సాధించడానికి ఏంలేదు, ఇప్పటినుంచి జీవితంలో వచ్చేదంతా బోనస్ అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా దేవుడు పాత్ర చేస్తుండడంతో ఆయన షూటింగ్ అయ్యేవరకు పచ్చి మంచి నీళ్లు కూడా తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చాడు.

Samuthirakani: దానివల్లే త్రివిక్రమ్ నాకు సపోర్ట్ చేశాడు.. లేకపోతే!

ఇక పవన్ కళ్యాణ్ గురించి సముద్రఖని మాట్లాడుతూ.. ” తమిళ్ లో చేసినప్పుడు కోవిడ్ సమయం కావడంతో ఎవరూ ముందుకు రాకపోవడంతో నేనే నటించాను అని చెప్పాను. ఈ కథని ఎక్కువ మందికి చేరువ చెయ్యాలని, కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ గారు చెప్పగానే ఒక్కసారిగా మాటల్లో చెప్పలేని ఆనందం కలిగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో కొన్ని మార్పులతో చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అలా కళ్యాణ్ గారికి కథ నచ్చడంతో వెంటనే సినిమా పని మొదలైంది. కాలమే త్రివిక్రమ్ గారిని, కళ్యాణ్ గారిని ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయన షాక్ అయ్యారు. అలా ఆయనను కలిసిన మూడు రోజులకే షూటింగ్ స్టార్ట్ చేశాం. ఆయన సెట్ లో అడుగుపెట్టగానే మొదట ఏం జరుగుతుందోనని మొత్తం గమనిస్తారు. దర్శకుడిగా నేను ఎంత క్లారిటీగా ఉన్నాను అనేది ఆయనకు మొదటిరోజే అర్థమైంది. ఆయన ఈ సినిమా కోసం ఎంతో చేశారు. సమయం వృధా చేయకూడదని సెట్ లోనే కాస్ట్యూమ్స్ మార్చుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులు ఉపవాసం చేశారు. ఎంతో నిష్ఠతో పనిచేశారు” అని చెప్పుకొచ్చాడు.