NTV Telugu Site icon

Samuthirakani: పొలిటికల్ లీడర్ బయోపిక్‌లో సముద్రఖని?

Samuthirakani

Samuthirakani

Samuthirakani to Play Title Role in a Political Leader’s Biopic: అసలు ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేని వారికి సైతం టాలెంట్ ఉంటే సినీ పరిశ్రమలో రెడ్ కార్పెట్ పరుస్తారు అని నిరూపించాడు సముద్రఖని. నిజానికి ఆయనది సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. నటుడిగా, దర్శకుడిగా ఏది చేసినా సముద్రఖని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా ఫుల్ బిజీగా సముద్రఖని సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. దర్శకుడిగా చేసినా, నటుడిగా చేసినా సముద్రఖని చేశాడు అంటే అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులలో కొంత నమ్మకం ఏర్పడింది. తన మనసుకి నచ్చితేనే పాత్ర చేస్తానని సముద్రఖని గతంలో ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు. అయితే అలాంటి సముద్రఖని గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అదేమంటే సముద్రఖని ఓ ప్రముఖ రాజకీయ నాయకుని బయోపిక్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు.

Rashmika: ‘యానిమల్’లో రచ్చ లేపావ్.. రష్మికపై అమితాబ్ ప్రశంసలు

దానికి ఇప్పటికే సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకుడు అవినీతి మచ్చలేని వ్యక్తిగా, పేద ప్రజల ఆశ జ్యోతిగా, ఉండడానికి స్వంత ఇళ్ళు కూడా సరిగ్గా నిర్మించుకోలేని ఓ గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నాడని అంటున్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి ఈ జనరేషన్ కి తెలియాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు రాగా ఆయన లైఫ్ స్ఫూర్తిదాయకం అని నమ్మి టైటిల్ రోల్ పోషించడానికి సముద్రఖని కూడా ముందుకు వచ్చినట్టు సినీ వర్గాల సమాచారం. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే సముద్రఖని మరో నట విశ్వరూపం చూడబోతున్నామని చెప్పక తప్పదు. ఇక సముద్రఖని ప్రస్తుతానికి నటుడు ధనరాజ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు.

Show comments