Samuthirakani Comments on Trivikram Supervising Bro Movie: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు కీలక పాత్రలలో నటించిన సినిమా బ్రో. సముద్రఖని డైరెక్ట్ చేసిన వినోదయ చిత్తం సినిమాను తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమా జూలై 28న రిలీజ్ అవుతున్న క్రమంలో డైరెక్టర్ సముద్రఖని మీడియాతో ముచ్చటించారు. ఇక ఈ క్రమంలో మీరు రచయిత అయ్యుండి త్రివిక్రమ్ గారి సహకారం తీసుకోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. తాను సమిష్టి కృషిని నమ్ముతానని పేర్కొన్న ఆయన ఇక్కడ నేటివిటీ మీద త్రివిక్రమ్ గారికి ఉన్న పట్టు నాకుండదని అన్నారు.. పైగా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించడం నాకే ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. నేను ఆయనతో అల వైకుంఠపురములో నుంచి ట్రావెల్ అవుతున్నాను.
Prathinidhi 2: డైరెక్టర్గా మారిన జర్నలిస్ట్.. ప్రతినిధి 2 ఫస్ట్ లుక్ చూశారా?
కానీ ఆయనకు సునీల్ వల్ల నా గురించి ముందే తెలిసిందని, శంభో శివ శంభో సమయంలో నా గురించి సునీల్ చెప్పేవారని అలా దర్శకుడిగా త్రివిక్రమ్ నన్ను ముందు నుంచే నమ్మారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాకి స్ఫూర్తి ఏంటి? అని అడిగితే మా గురువు గారు బాలచందర్ గారితో కలిసి 2004 సమయంలో ఒక డ్రామా చూశానని అన్నారు. ఎలా ఉందని గురువుగారు అడిగితే, బాగుంది సార్ కానీ సామాన్యులకు చేరువయ్యేలా చేస్తే బాగుంటుంది అన్నానని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆ కథ నాతో పయనిస్తూనే ఉందని, దానిని స్ఫూర్తిగా తీసుకొని 17 ఏళ్ళ తర్వాత సినిమాగా తీశానని అదే వినోదయ సిత్తం అన్నారు. ఆ స్టేజ్ ప్లే రచయిత డబ్బు ఇస్తానన్నా తీసుకోలేదని, సమాజానికి మనం మంచి సందేశం ఇవ్వాలని ప్లాన్ చేస్తే, సమాజం మనకి మంచి చేస్తుందని అన్నారని ఇక ఈ సినిమా విషయంలో అదే జరిగిందని అన్నారు.