Site icon NTV Telugu

తిరుమల శ్రీవారిని దర్శించిన సంపూర్ణేష్ బాబు

Sampoornesh Babu Visited Tirumala

టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ తిరుమలను సందర్శించారు. ఈ రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన సినిమా మరో రోజుల్లో విడుదలవుతున్న నేపథ్యంలో శ్రీవారి పాదాల చెంతకు చేరి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 20వ తేదిన “బజార్ రౌడీ” సినిమా విడుదల అవుతుంది. “బజార్ రౌడీ” మూవీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం. దీనికి డి. వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నటించారు. సాయాజీ షిండే, కత్తి మహేష్, కరాటే కళ్యాణి, షఫీ, పృధ్వీరాజ్ మరియు నాగినీడు సహాయక పాత్రల్లో కనిపిస్తారు. ఎస్ఎస్ ఫ్యాక్టరీ సంగీతం సమకూర్చగా, విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. గౌతమ్ రాజు ఎడిట్ చేసారు. కేఎస్ క్రియేషన్స్ పతాకంపై సంధి రెడ్డి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read Also : అగ్ని ప్రమాదం : మంటల్లో సినిమా షూటింగ్ జనరేటర్

వచ్చే నెల సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన మరో చిత్రం “క్లాలి ఫ్లవర్” సినిమా విడుదల అవుతుంది. ఆర్ కె మలినేని దర్శకత్వం వహించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “క్యాలీఫ్లవర్”. ప్రజ్వల్ క్రిష్ సంగీతం సమకూర్చగా, ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ చేసారు. మధు సుధాన క్రియేషన్స్, రాధా కృష్ణ టాకీస్ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version