సైకిల్ పై ఫ్రెండ్స్ తో చక్కర్లు కొడుతున్న సామ్… పిక్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత అక్కినేని గత కొన్ని రోజులుగా డివోర్స్ వార్తలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే వాటన్నింటికీ సామ్ ఒకే ఒక్క పోస్ట్ తో ఫుల్ స్టాప్ పెట్టిసింది. ఆ పోస్ట్ లో కుక్కపిల్లలను చూపిస్తూ మీడియా చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చేసి చూపిస్తుందని కామెంట్ చేసింది. ఇదిలా ఉండగా సమంతకు సంబంధించిన ఓ తాజా ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ పిక్ లో సామ్ సంతోషంగా కన్పిస్తోంది. పైగా ఫ్రెండ్స్ తో కలిసి సైకిల్ పై చక్కర్లు కొడుతూ కన్పించింది. సామ్ తో పాటు ఆమె క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఈ ఫోటోను సామ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సామ్ ఎప్పటిలాగే పూల బైకర్ షార్ట్ ధరించి అందంగా, ఫిట్‌గా కన్పించింది.
Read Also : “రిపబ్లిక్” సెకండ్ సింగిల్ కు టైం ఫిక్స్
Also Read
సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్డేట్స్ పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది సామ్. సమంత అక్కినేని ప్రస్తుతం పౌరాణిక చిత్రం “శాకుంతలం”లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ, మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నెక్స్ట్ ఆమె నయనతార, విజయ్ సేతుపతితో పాటు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న “కాతు వాకుల రెండు కాదల్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..