Samantha Watches Hi Nanna at AMB Theatre: న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అన్ని సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు కన్నా మూడో రోజు హాయ్ నాన్న కలెక్షన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఈ సినిమాకి డిసెంబర్ 22 వరకూ పోటీ లేదు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. హాయ్ నాన్న మౌత్ టాక్ పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో యానిమల్ కంటే దీనిని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుకోవడానికి హాయ్ నాన్న సినిమా చాలా దూరంలో ఉన్నా కూడా సలార్ రిలీజ్ కావడానికి ఇంకా పది రోజుల సమయం ఉండటంతో బ్రేక్ ఈవెన్ మార్క్ ని టచ్ చేసే లాగే ఉందని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమాను సమంత హైదరాబాద్ ఏఎంబీ మాల్ లో కనిపించింది.
Prithviraj Sukumaran: సలార్ కోసం.. వరద మొట్టమొదటిసారి ఆ పనిచేశాడంట..
నిజానికి కొద్ది రోజులుగా వెండితెరపై కనిపించని సమంత సోషల్ మీడియాలో మాత్రం తరచూ దర్శనమిస్తుంది. హెల్త్ ట్రీట్మెంట్ అంటూ షూటింగ్స్ కి బిగ్ బ్రేక్ ఇచ్చేసిన సమంత ఫోటో షూట్స్ కి మాత్రం ఎలాంటి బ్రేకివ్వడం లేదు. సమంత తాజాగా హైదరాబాద్ ఏఎంబీ లో దర్శనమిచ్చింది. ఆమె నాని నటించిన హాయ్ నాన్న మూవీ చూడడానికి ఏఎంబీకి వచ్చింది. అది కూడా తా ఆధ్వర్యంలో నడిచే ప్రత్యూష ఫౌండేషన్ చిన్న పిల్లలతో కలిసి సమంత ఏఎంబీలో హాయ్ నాన్నని వీక్షించింది. ప్రస్తుతం ఆమె ఏఎంబీలో సినిమా చూసేందుకు వెళుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి.