NTV Telugu Site icon

Samantha : ఎట్టకేలకు చైని ఫాలో చేయడం ఆపేసిన బ్యూటీ… కానీ…!

Samantha

Samantha and Naga Chaitanya గత ఏడాది విడిపోయిన విషయం తెలిసిందే. ఈ మాజీ భార్యాభర్తల గురించి ఏ వార్త వచ్చినా ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సమంత తన మాజీ భర్త నాగ చైతన్యను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. ఇప్పుడు ఈ విషయంపై నెట్టింట్లో హాట్ చర్చ నడుస్తోంది. ఇద్దరూ 2021 అక్టోబర్ 2న విడాకులు ప్రకటించారు. దాదాపు వీరిద్దరూ విడిపోయి ఐదు నెలలయ్యాక సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో తన మాజీ భర్త నాగ చైతన్యను అన్‌ఫాలో చేసింది. అయితే నాగ చైతన్య మాత్రం సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్నాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే… సామ్ నాగ చైతన్య సోదరుడు అఖిల్ అక్కినేనితో పాటు ఇతర అక్కినేని కుటుంబ సభ్యులను మాత్రం ఫాలో అవుతోంది.

Read Also : Salman Khan : చిక్కుల్లో భాయ్… తెరపైకి జర్నలిస్ట్ పై దాడి కేసు

సమంత ఇప్పుడు తన సినీ కెరీర్ లో బిజీగా ఉంది. ప్రస్తుతం సామ్ నటించిన శాకుంతలం, కాతు వాకుల రెండు కాదల్ అనే రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరో పాన్ ఇండియన్ చిత్రం యశోద షూటింగ్‌లో కూడా బిజీగా ఉంది. అంతేకాకుండా బాలీవుడ్‌లో వరుణ్ ధావన్‌తో రాజ్ & డికె ప్రాజెక్ట్ ‘సిటాడెల్‌’తో, జాన్ ఫిలిప్స్‌తో ‘అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌’తో హాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సామ్ సిద్ధంగా ఉంది. మరోవైపు చై ‘థ్యాంక్యూ’ సినిమా రిలీజ్ కోసం వేచి ఉన్నాడు. వెబ్ సిరీస్ ‘దూత’లో కూడా సరికొత్త పాత్రలో కనిపించబోతున్నాడు.

ఎట్టకేలకు అన్ ఫాలో చేసిందిగా..! | Samantha And Naga Chaitanya | NTV Entertainment