Site icon NTV Telugu

Samantha: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? వైరల్ అవుతున్న ఫోటో

Samantha

Samantha

Samantha: హీరో నాగచైతన్యతో విడాకుల తర్వాత నటి సమంత కెరీర్‌లో బిజీగా మారి సినిమాల మీదే తన దృష్టి సారించింది. తాజాగా ఆమె మరోసారి ప్రేమలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఆమె ధరించిన టీషర్ట్. ఓ టీ షర్టును సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు వైరల్‌ అవుతోంది. సదరు టీ షర్టుపై ‘నువ్వు ఎప్పుడూ ఒంటరిగా నడవవు’ అని రాసి ఉంది. దీంతో ఆమె ఒంటరిగా లేదని.. వేరొకరితో రిలేషన్‌లో ఉందని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. అయితే గతంలో ఓసారి సమంత లవ్ గురించి మాట్లాడుతూ.. మరోసారి ప్రేమలో పడేంత ఆసక్తి తనకు లేదని స్పష్టం చేసిన క్రమంలో ఇప్పుడు ఇలా టీషర్ట్ ఫొటోలు పోస్టు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Read Also: Video Games: వీడియో గేమ్స్‌తో పిల్లలకు ప్రాణాపాయం.. గుండె సమస్యలు తప్పవు..!!

కాగా హీరోయిన్ సమంత చాలా రోజులకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఆమె కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేదు. అనారోగ్య సమస్యల కారణంగా అమెరికా వెళ్లిన సమంత అక్కడ చికిత్స తీసుకుంటున్నట్లు టాక్ నడిచింది. అటు సమంత ప్రస్తుతం నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీకి ఖుషి అనే టైటిల్ ఖరారు చేశారు. మెచ్యూర్ లవ్‌స్టోరీతో వస్తున్న ఈ సినిమాకు నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంత నటిస్తున్నందుకు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సమంత సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే 25 శాతం ఎక్కువ ఈ సినిమా కోసం నిర్మాతలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

https://twitter.com/Samanthaprabhu2/status/1579672167851384832

Exit mobile version