NTV Telugu Site icon

Samantha : షికార్లు అయిపోయాయ్.. ఇక డివోషనల్ మోడ్ ఆన్!

Samantha At Tirumala

Samantha At Tirumala

Samantha took Blessins from Tiruchanuru Padmavathi Amman: స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతకమైన వ్యాధితో ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకునేందుకు గాను సుమారు ఏడాది పాటు సినిమాలకు ఆమె గ్యాప్ ఇస్తుందని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఖుషి షూటింగ్ జరిగి ఇప్పటికే ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. ఈ మధ్యనే ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోషూట్ అయితే ఒక్కసారిగా కలకలం రేపినట్లయింది.

Eagle OTT: ఈగల్ ఓటీటీ వెర్షన్ లో ఈ మార్పు చూశారా.. ఇదేం ట్విస్ట్ మావా?

ఆమె మళ్ళీ సినిమాలకు సిద్ధం అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందరూ భావించారు. ఇక ఆ తర్వాత కూడా కొన్ని నార్మల్ ఫోటోలు షేర్ చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు డివోషనల్ మూడ్ లోకి వెళ్ళిపోయింది. ఆమె తాజాగా టెంపుల్ సిటీ తిరుపతిలో దర్శనం ఇచ్చింది. తిరుపతిలో ఉన్న తిరుచానూరు పద్మావతి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఒప్పుకున్న సినిమాలు అయితే ఏమీ లేవు. ఆమె సినిమాలకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రచారం జరగడంతో ఆమె సినిమాల అప్డేట్స్ కూడా ఏమీ బయటకు రాలేదు. ఇక ఆమె చేసిన సిటాడెల్ సిరీస్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే ఈ సిరీస్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేదానిపై అయితే క్లారిటీ లేదు.

Show comments