Site icon NTV Telugu

Samantha : ఆ డైరెక్టర్ తో క్లోజ్ గా ఫొటో దిగిన సమంత..

Samantha

Samantha

Samantha : స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ వార్తల్లో నిలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఆమె టాలీవుడ్ లో ట్రెండింగ్ లో కనిపిస్తోంది. హీరోయిన్ గా చేసి చాలా రోజులు అవుతున్న తరుణంలో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె నిర్మించిన శుభం మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం వరుస ప్రమోషన్లలో సమంత బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే సమంత రూమర్డ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో నిత్యం కనిపిస్తోంది. అతనితో దిగిన ఫొటోలను వరుసగా పోస్టు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి అతనితో క్లోజ్ గా దిగిన ఫొటోను పోస్టు చేసింది.

Read Also : The Paradise : రికార్డు బ్రేకింగ్ ధరకు నాని పారడైజ్ ఆడియో రైట్స్

శుభం మూవీకి వస్తున్న పాజిటివ్ టాక్స్ పై ఆమె పోస్టు చేసింది. కొన్ని ఫొటోలను పంచుకుంది. ఇందులో రాజ్ నిడుమోరుతో క్లోజ్ దిగిన ఫొటో ఉంది. ఇందులో రాజ్ భుజంపై ఆమె వయ్యారంగా తల వాల్చి సెల్ఫీ దిగింది. ఈ ఫొటో చూసిన వారంతా.. సమంత తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసేసింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన వారిలో రాజ్ కూడా ఒకరు. అందులో సమంత నటించి మెప్పించింది. అప్పటి నుంచి కొన్ని రోజులు వీరిద్దరూ కలిసి కనిపించలేదు. ఇప్పుడు శుభం సినిమా నుంచే వీరిద్దరూ మళ్లీ ట్రెండింగ్ లో ఉంటున్నారు. వీరిద్దరి రిలేషన్ పై రకరకాల రూమర్లు వస్తున్నా వారు మాత్రం స్పందించట్లేదు.

Read Also : Nithin : అప్పుడు రాబిన్ హుడ్.. ఇప్పుడు తమ్ముడు.. నితిన్ త్యాగాలు..!

Exit mobile version