NTV Telugu Site icon

Samantha: సమంత కు రూ. 6 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. అందుకే ఆ పని చేసిందా.. ?

Sam

Sam

Samantha: చిత్ర పరిశ్రమలో నటీనటులు.. ఒక సినిమా ఒప్పుకున్నారు అంటే.. అది కొన్నిసార్లు కథ నచ్చి ఒప్పుకుంటారు. ఇంకొన్నిసార్లు రెమ్యూనిరేషన్ నచ్చి ఒప్పుకుంటారు. ఇక ప్రస్తుతం రెమ్యూనిరేషన్స్ విషయంలో హీరోయిన్స్ చాలా పర్టిక్యులర్ గా ఉంటున్నారు. మార్కెట్ లో తమకు ఉన్న పాపులారిటీని బట్టి అందుకుంటున్నారు. ఇక కొన్నిసార్లు స్టార్ హీరో సినిమాలో చేసేటప్పుడు అటుఇటు చూసుకున్నా.. కొత్త హీరోలతో చేసేటప్పుడు మాత్రం అస్సలు తగ్గేదేలే అని అందినంత తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత.. ఒకప్పుడు ఒక సినిమా కోసం దాదాపు రూ. 6 కోట్ల విలువ చేసే బంగ్లా తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా ఏదో కాదు అల్లుడు శ్రీను. నిర్మాత బెల్లంకొండ సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతని కొడుకుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. అల్లుడు శ్రీను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. నిర్మాత కొడుకు ఎంట్రీ అంటే.. ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమా కూడా ఆ రేంజ్ లోనే ఉంది అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.

Tripti Dimri: మార్కెట్ లోకి కొత్త క్రష్ వచ్చింది మావో..

వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అప్పుడు హీరోయిన్ గా ఉన్న సామ్.. ఈ సినిమాలో శ్రీనివాస సరసన నటించింది. ఒక అప్ కమింగ్ హీరోతో సమంత నటిస్తుంది అనేసరికి అందరూ షాక్ కూడా అయ్యారు. అయితే ఈ సినిమా కోసం సామ్.. భారీగా రెమ్యూనిరేషన్ తీసుకోవడం వలనే ఒప్పుకుందని తెలుస్తోంది. మొదట్లో సామ్.. ఈ సినిమాను ఒప్పుకోలేదని, ఆ తరువాత బెల్లంకొండ సురేష్.. సామ్ ను ఒప్పించడానికి రూ. 6 కోట్ల బంగ్లా గిఫ్ట్ ఇచ్చాడని, అందుకే ఆమె హీరోయిన్ గా చేసిందని టాక్. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. ఆ తరువాత నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నిలబడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ వార్తపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. తప్పేముంది.. అది కూడా రెమ్యూనిరేషన్ యేగా అని కొందరు.. కొత్త హీరోతో చేయడానికి ఆ మాత్రం తీసుకోవడంలో తప్పు లేదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. అయితే అసలు ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Show comments