NTV Telugu Site icon

Samantha Break: ఏడాది రెస్ట్.. సమంతకి ఎన్ని కోట్లు నష్టమో తెలుసా?

Samantha Ruthprabhu

Samantha Ruthprabhu

Samantha Loss in Break: గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్న సమంత రూత్ ప్రభు ఒక ఏడాది పాటు సినిమాలకి బ్రేక్ తీసుకుంది. ఇప్పుడైతే ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతోంది కానీ ఆమె త్వరలో అమెరికా వెళ్లి చికిత్స తీసుకోబోతుందని ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలో ఆమె ఇప్పుడు ఎటువంటి ప్రాజెక్ట్‌లకు సంతకం చేయడానికి సిద్ధంగా లేదు. అంతేకాదు ఆమె గతంలోనే నిర్మాతల నుంచి తీసుకున్న అడ్వాన్స్ లను కూడా తిరిగి చెల్లించింది. నిజానికి ది ఫ్యామిలీమ్యాన్ 2తో పాన్-ఇండియన్ ఇమేజ్ సంపాదించిన తర్వాత సమంత అప్పటి రెమ్యునరేషన్ ను ఆమె గట్టిగానే పెంచేసింది. ఆ తరువాత నుంచి సమంత కొత్త సినిమాలు చేసేందుకు గాను రూ. 10 కోట్ల దాకా డిమాండ్ చేస్తోంది. ఇక ఆమె చివరిగా చేసిన ఖుషీ, సిటాడెల్ సినిమాలు కోసం రూ. 5 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు నటి రాబోయే ఆరు నెలల పాటు సినిమాలను చేయడం ఆపేసింది.

Varun Tej 14: ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో వరుణ్ తేజ్ 14.. డైరెక్టర్ ఎవరంటే?

అలా చేయడం వలన ఆమెకు బ్రాండ్‌ల నుంచి వచ్చే డబ్బు మినహాయించి దాదాపు రూ. 15-20 కోట్ల నష్టం వాటిల్లుతుంది. బ్రాండ్‌లతో సహా, నటికి సంవత్సరానికి దాదాపు 30 కోట్ల రూపాయల నష్టం ఉంటుందని అంటున్నారు. ఇక బ్యాక్-టు-బ్యాక్ షూట్‌లతో ఒక సంవత్సరం గడిపిన సమంత, తనను తాను రీ ఫ్రెష్ చేసుకోవాడ్నైకి ఈబ్రేక్ అవసరమని సమంత నమ్ముతోంది. నిజానికి ఆమె చేసిన ఖుషీ, సిటాడెల్ వెబ్ సిరీస్‌లను ప్రమోట్ చేస్తుందని అంటున్నారు. ఆమె కేవలం నటన నుండి మాత్రమే విరామం తీసుకుంటుందని అంటున్నారు. ఇక 2024లో ఆమె మళ్ళీ నటన మొదలు పెడుతుందని ఆమెకు ఇప్పటికే చాలా అవకాశాలు క్యూలో ఉన్నాయని అంటున్నారు. ఇక ఆమె బ్రేక్ పూర్తి చేసుకుని తరువాత అధికారికంగా ప్రకటిస్తారని అంచనాలు ఉన్నాయి. ఇక త్వరలోనే సమంత అమెరికా వెళ్లనుందని అంటున్నారు.

Show comments