ఓ బాలీవుడ్ స్టార్ హీరో ఇచ్చిన ఛాలెంజ్ కు సామ్ అదిరిపోయే వీడియోతో రిప్లై ఇచ్చింది. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు ? అన్నట్టుగా ప్రతిరోజూ వర్కవుట్స్ కే చెమటలు పట్టించే సామ్ కు Attack Challenge విసిరాడు టైగర్ ష్రాఫ్. మరి సామ్ ఊరికే ఉంటుందా? వర్కౌట్స్ లో అసలు ఎటాక్ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేసింది. కిల్లర్ వర్కౌట్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసి టైగర్ ష్రాఫ్ కు సమాధానం ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సామ్ షేర్ చేసిన ఆ వీడియోలో ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తోంది సామ్. అయితే దానికి తగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి వీడియోను పోస్ట్ చేసింది. అంతేకాదు Attack Challengeకు అర్జున్ కపూర్‌ని నామినేట్ చేసింది.
Read Also : Mishan Impossible : స్టార్ హీరోలను వాడేస్తున్న డైరెక్టర్
నలుపు రంగు జిమ్ డ్రెస్ ధరించిన సామ్ “నన్ను సవాలు చేసినందుకు టైగర్ ష్రాఫ్ కు ధన్యవాదాలు! ఇదిగో ఎటాక్ ఛాలెంజ్ కి నేను అర్జున్ కపూర్ ని నామినేట్ చేస్తున్నాను!!” అంటూ పోస్ట్ ను షేర్ చేసింది. జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి రకుల్ చేస్తున్న కొత్త చిత్రం ‘ఎటాక్’. ఈ సినిమా ప్రమోషన్‌లలో భాగంగా రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటాక్ ఛాలెంజ్‌ని ప్రారంభించింది. ‘ఎటాక్’ మూవీ ఏప్రిల్ 1న థియేటర్లలోకి రానుంది. మరోవైపు సామ్ ప్రస్తుతం హరి మరియు హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియన్ చిత్రం యశోద షూటింగ్‌లో బిజీగా ఉంది.
