NTV Telugu Site icon

Samantha: పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా

Sam

Sam

Samantha: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం కూడా తెల్సిందే. అయితే మాత్రం ఏం.. సామ్.. నిత్యం సోషల్ మీడియాలో అమ్మడు హల్చల్ చేస్తూనే ఉంది. ఒక్క సినిమాలోనే సామ్ కనిపించడం లేదు కానీ యాడ్స్ లో.. ఈవెంట్స్ లో బాగానే కనిపిస్తుంది. ఇక సామ్.. ఎప్పటినుంచో సాకీ బ్రాండ్ తో ఆన్ లైన్ దుస్తుల వ్యాపారం నడిపిస్తుంది. ఇక అందులో భాగంగానే సామ్.. దానికి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా కొనసాగుతోంది. ఇక గత వారం నుంచి సాకీలోని కొత్త సారీ కలక్షన్స్ ను చూపిస్తూ అదరగొట్టింది. తాజాగా పింక్ కలర్ చీరలో సామ్ హొయలు పోయింది. వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ పై.. పింక్ కలర్ సాకీ చీరను కట్టుకొని కనిపించింది. ముఖ్యంగా చీర పైటను పక్కకు జరిపి.. ఎద అందాలను చూపిస్తూ.. ఓరగా ఉన్న నడుమును పక్కకు నెట్టి నవ్వుతూ కనిపించింది. ఇక సామ్ ను ఈ రేంజ్ లో చూసిన అభిమానులు ఊరికే ఉంటారా.. ? సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

Tarun Bhascker: పిచ్చోడు… డైరెక్షన్ తప్ప అన్ని చేస్తాడు

ఇక ఈ ఫోటోకు సమంత.. “సుతిమెత్తనైన ఈ చక్కటి ఎంబ్రాయడరీ కలిగి ఉన్న పింక్ కలర్​​ చీర.. మీరు కలలు కనే ధైర్యాన్ని, దాన్ని సాకారం చేసుకునే అవకాశమున్న మాయాలోకానికి మార్గం చూపుతోంది. ఆకర్షితమైన ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహమయ్యేందుకు సిద్ధంగా ఉండంది. ఎందుకంటే ఈ చక్కటి కలల ప్రపంచంలో నక్షత్రాల వెలుతురు నడుమ మీ హృదయం ఆకాశంలో తేలిపోతుంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. పైట పక్కకు జరిపి.. ఫొటోకు పోజ్ ఇస్తే.. కుర్రాళ్లు ఆగేనా అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.