Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ ఏర్పడుతుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ సమంత మాత్రం వాటిపై స్పందించట్లేదు. మరీ ముఖ్యంగా చైతూ, శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత రాజ్ నిడుమోరుతో సమంత ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి అదే డైరెక్టర్ తో దొరికిపోయింది సమంత. దీపావళి సందర్భంగా రాజ్ నిడుమోరు ఇంట్లో సమంత కనిపించింది. ఇద్దరూ కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Read Also : Varun Tej : కొడుకుతో వరుణ్, లావణ్య దీపావళి వేడుకలు..
గతంతో పోలిస్తే సమంత మీద రోజు రోజుకూ రూమర్లు ఎక్కువవుతున్నాయి. ఈ ఫొటోలతో సమంత తన డేటింగ్ ను కన్ఫమ్ చేసినట్టే అంటున్నారు అభిమానులు. అయితే సమంత ఎక్కడ కూడా ఈ విషయాలపై అస్సలు స్పందించట్లేదు. ఒకవేళ నిజం కాకపోతే ఓపెన్ గా చెప్పొచ్చు కదా. అలా చెప్పకపోవడం వల్ల ఈ రూమర్లు మరింత ఎక్కువ అవుతున్నాయి. మరి సమంత ఇలాగే రూమర్లను కంటిన్యూ చేస్తుందా.. లేదంటే వాటికి బ్రేక్ వేస్తుంది అనేది తెలియాల్సిందే. ప్రస్తుతం సమంత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఖుషి సినిమా తర్వాత తెలుగులో మరో సినిమాను ప్రకటించలేదు. నందిని రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. కానీ దానిపై కూడా ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. మరి ఇటు సినిమాలపై అటు రాజ్ తో డేటింగ్ రూమర్లపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.
Read Also : Naga Chaitanya : నాగచైతన్య, శోభిత దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ చూశారా