NTV Telugu Site icon

Ram Charan: చరణ్ డాన్స్ కి సమంత ఫిదా.. ఎవరయ్యా ఇలా చేసేది?

Ra Macha Macha

Ra Macha Macha

Samantha Says Ram Charan Dance in Unmatchable in Ra Macha Macha Song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధ‌మ‌వుతోన్న ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ సాంగ్‌ను సెయింట్ మార్టిన్స్ కాలేజ్‌లో స్టూడెంట్స్ స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. ఈ సాంగ్ మాస్ బీట్ తో ఎంతో ఉత్సాహంగా ఉండగా రామ్ చరణ్ కూడా ఒక రేంజ్ లో డాన్స్ చేస్తూ కనిపించాడు. ఆయనతో పాటు ఈ పాటలో వేల మంది డ్యాన్సర్లు, కమెడియన్ సత్య, ప్రియదర్శి లాంటి వాళ్లు కూడా కనిపించారు.

Chandrahass: సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్‌… యాటిట్యూడ్ స్టార్ షాకింగ్ కామెంట్స్‌

చాలా రోజుల తర్వాత చరణ్ సోలో స్టెప్పులు చూసే అవకాశం అభిమానులకు దక్కినట్టు అయింది. ఇక అంచనా వేసినట్లే ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా నిలిచింది. ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశాడు. ఇక నకాల్ అజీజ్ ఈ పాట పాడగా రామ్ చరణ్ వేసిన స్టెప్పులను కొరియోగ్రాఫ్ చేసింది ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. ఈ పాటలో చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక ఈ డ్యాన్స్ బాగా నచ్చేయడంతో రామ్ చరణ్ సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో కింద సమంత అన్ మ్యాచబుల్ అని కామెంట్ చేసింది. అంతేకాక అసలు ఫార్మల్ షర్ట్, ప్యాంటు వేసుకున్న ఎవరైనా ఇలా డాన్స్ చేయగలరా? అంటూ ఆమె ప్రశ్నించింది. ఇక తెలుగు సంస్కృతిని చూపించ‌టానికి 1000 మంది జాన‌ప‌ద క‌ళ‌కారుల‌తో ఈ పాట‌ను చిత్రీక‌రించారు.

Show comments