Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. అయితే సామ్.. ఒక్క సినిమాలకు మాత్రమే గ్యాప్ ఇచ్చింది. సినిమాలు తప్ప అన్ని చేస్తోంది. యాడ్స్, ఈవెంట్స్ చేస్తూ బిజీగా మారింది. ఇక తాజాగా ఈ భామ మార్వెల్ టీమ్ తో జతకట్టింది. 2019 బ్లాక బస్టర్ హిట్ కెప్టెన్ మార్వెల్ కోసం మార్వెల్ స్టూడియోస్ తో సామ్ చేతులు కలిపింది. భారతీయ అభిమానుల కోసం ప్రత్యేక ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ దీపావళికి, ఈ పండుగ సీజన్లో గొప్ప యాక్షన్, అడ్వెంచర్ మరియు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి సిద్ధంగా ఉంది ది మార్వెల్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్వెల్ స్టూడియోస్ యొక్క ది మార్వెల్స్ నవంబర్ 10న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే సామ్.. తెలుగు ప్రోమోను రిలీజ్ చేసింది. అలాగే దానికి సంబంధించి దేశవ్యాప్తంగా నవంబర్ 4న అన్ని ఫార్మాట్లలో ముందస్తు బుకింగ్లు ప్రారంభమవుతాయని ప్రకటించింది.
VarunLav: వరుణ్ – లావణ్య పెళ్లి ఖర్చు.. ఎన్ని కోట్లు అయ్యిదంటే..?
ది మార్వెల్స్ గురించి మరియు కెప్టెన్ మార్వెల్ పట్ల తనకున్న ప్రేమను ఈ వేదిక మీద పంచుకుంటూ “కెప్టెన్ మార్వెల్ ఎప్పుడూ నాకు అత్యంత ఇష్టమైన సూపర్ హీరో. ఈ ఎపిక్ దీపావళి ఎంటర్టైనర్ కోసం మరోసారి మార్వెల్ ఇండియాతో జతకట్టడానికి నేను థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఒకరు కాదు ముగ్గురు శక్తివంతమైన సూపర్ హీరోలు ఈసారి చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పోరాడుతున్నారు. మార్వెల్స్ సినిమా థియేటర్ లలో ఎపిక్ యాక్షన్-ప్యా క్డ్ ఎంటర్టైనింగ్ రైడ్ లాగా మనకు ముందుకు వస్తుంది. సూపర్ హీరోలను ఈ దీపావళికి పెద్ద స్క్రీన్ పైనే చూడటానికి నేను ఉత్సహంగా ఎదురుచూస్తున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సామ్ లుక్ చూసి అభిమానులు.. సామ్.. నువ్వెందుకని మార్వెల్ సిరీస్ లో నటించకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.