Samantha Ruth Prabhu taking Cryotherapy: సమంత రూత్ ప్రభు ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తన వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో, ఆమె క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వీడియో షేర్ చేసుకుంది. అక్కడ ఆమె టబ్ లాంటి కంటైనర్‌లో మునిగిపోయి కళ్ళు మూసుకోవడం కనిపిస్తుంది. ఇక తాను కోలుకునే ప్రక్రియలో సహాయం చేయడానికి, క్రియోథెరపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి ఈ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ అవుతోంది. సమంత రూత్ ప్రభుకి గతంలో తనకు మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది.
Bigg Boss Telugu 7: శివాజి గుట్టురట్టు చేసిన గౌతమ్.. తేల్చుకుంటా అంటూ షాకింగ్ గా?
క్రియోథెరపీ అనేది శరీరంలో అసాధారణ కణజాలాలను నాశనం చేయడానికి గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో బాడీని ఎక్స్ పోజ్ చేస్తూ ఈ ప్రక్రియ చేస్తున్నారు. సమంత సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీలో సినిమాలో కనిపించింది. ఆమె ఇప్పుడు రాజ్ – డీకే రూపొందిస్తున్న సిటాడెల్ ఇండియన్ వెర్షన్ లో కూడా యాక్ట్ చేసింది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా నటించనున్నారు. నిజానికి సమంత రూత్ ప్రభు మార్వెల్ స్టూడియోస్ నుండి వస్తున్న ‘ది మార్వెల్స్’ ప్రమోషన్స్ లో భాగమైంది. నంబర్ 10న ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళం, హిందీలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ సామ్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో హాజరై అందరినీ ఆకట్టుకుంది.