NTV Telugu Site icon

Samantha: ఆ విషయంలో వంద మార్కులు.. ట్రిప్పులో ‘సమంత’ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు!

Samantha Dance

Samantha Dance

Samantha Ruth Prabhu shares video from her Bali vacation: నటి సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించి తన అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక అలా ప్రకటించిన తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సినిమాలకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి మరోసారి చర్చనీయాంశం అయింది. ఇక ప్రస్తుతానికి ఇండోనేషియాలోని బాలిలో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె తన ట్ట్రిప్ ను గర్ల్స్ ట్రిప్ అని చెప్పడమే కాదు ఆ ట్రిప్ కి 100 మార్కులు కూడా వేసేసింది. నిజానికి సమంత ఇటీవల ఐస్ బాత్ థెరపీ చేస్తునప్పుడు తన ఫొటోలను షేర్ చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సమంత తన బిజీ షెడ్యూల్ నుంచి విశ్రాంతి తీసుకుంటోంది. తాజాగా ఆమె ఈ రోజు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా రీల్‌ను షేర్ చేసింది. అందులో ఆమె తన స్నేహితురాలు అనూష స్వామితో కలిసి ఒక గ్రూవీ ట్యూన్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. సమంత ఫిట్‌నెస్ ఫ్రీక్, సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి అంటే బ్రేక్ ఒక్కటే దారి అని భావిస్తూ ఆమె ఈ వెకేషన్ కి వెళ్ళింది.

Neethone Nenu: జోరుమీదున్న కుషిత క‌ళ్ల‌పు.. హీరోయిన్ గా‘నీతోనే నేను’ టైటిల్ పోస్ట‌ర్ లాంచ్‌

ఇక ఈవెకేషన్ లో ఆమె ధ్యానం, సైక్లింగ్ , బాక్సింగ్ వంటి అనేక ఆరోగ్యకరమైన వ్యాయామాలను చేయడం కన్పిస్తోంది. ప్రస్తుతం, ఆమె తన స్నేహితురాలు అనూషా స్వామితో కలిసి ఇండోనేషియాలోని బాలిలో నేచర్ ను ఎంజాయ్ చేస్తోంది. తన వెకేషన్ పోస్ట్‌లతో అందరినీ అసూయపడేలా చేస్తున్న సమంత మరికొంత కాలం తన వెకేషన్‌ను ఎంజాయ్ చేయనుంది. సమంత సినిమాల విషయానికి వస్తే ఆమె ఖుషిలో కనిపించనుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 2023న విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఒక ఆర్మీ అధికారి, కాశ్మీరీ అమ్మాయి మధ్య ఏర్పడే ప్రేమ కథగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. తెలుగులోనే కాదు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.