Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి, తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇక చాలా రోజుల తరువాత సామ్ మీడియా ముందుకు రావడంతో ఎక్కడలేని ప్రశ్నలు అన్ని పుట్టుకొచ్చేశాయి. ఎన్నో ఆశలతో మొదలుపెట్టిన ఆమె వైవాహిక జీవితం నాలుగేళ్లు కూడా పూర్తి అవ్వకముందే ముగిసిపోయిందన్న విషయం తెల్సిందే. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె కొన్ని విబేధాల కారణంగా భర్త నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఈ జంట తమ తమ కెరీర్స్ ను బిల్డ్ చేసుకొనే పనిలో ఉన్నారు. ఈ మధ్యనే సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారినుంచి బయటపడడంతో ఈ రెండు టాపిక్స్ పైనే అందరు ఆసక్తిని చూపిస్తున్నారు.
Disney Plus HS: ‘ఓ కల’కనే సమయం వచ్చేసింది!
ఇక గతకొన్ని రోజుల నుంచి నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్నదంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ లండన్ లో డేటింగ్ చేస్తూ కూడా కనిపించారు. ఈ రిలేషన్ పై వీరిద్దరూ నోరు విప్పింది లేదు. తాజాగా సమంతకు ఒక ఇంటర్వ్యూలో చై, శోభితా డేటింగ్ ప్రశ్న ఎదురయ్యిందని, ఆమె వారి రిలేషన్ గురించి ఘాటు ఆరోపణలు చేసినట్లు ఒక వెబ్ సైట్ రాసుకొచ్చింది. అందులో ఇలా ఉంది. “ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నా నేను పట్టించుకోను. ప్రేమ విలువ తెలియని వాళ్లు ఎవరితో డేటింగ్ చేసినా చివరికి వారికి కన్నీళ్లనే మిగులుస్తారు. ఇప్పటికైనా అతను మారి ఆ అమ్మాయిని సంతోషంగా ఉంచగలిగితే అదే చాలు. తన ప్రవర్తన మార్చుకుంటే మంచిది” అని సామ్ చెప్పినట్లు రాశారు. ఇక ఈ వార్త చదినవారు సమంత అంత మాట అన్నదా..? అని ఆశ్చర్యపోతూ.. సామ్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆమె ఈ వ్యాఖ్యలపై స్పందించింది. “నేనెప్పుడు ఇలా చెప్పలేదు” అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.