Site icon NTV Telugu

Samantha : “నా లైఫ్‌లో ఉన్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడేం చెప్పలేను.. కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాను”

Samantha

Samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు.. వ్యక్తిగతంగా ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కొని, ఇప్పుడు మళ్లీ తన జీవితాన్ని కొత్తగా మలుచుకుంటోంది. విడాకులు, ఆరోగ్య సమస్యలు, కెరీర్‌లో బ్రేక్ ఈ అన్ని దశల తర్వాత సమంత ఇప్పుడు తనను తాను మళ్లీ నిర్మించుకుంటుంది. ఇటీవల ఆమె “Authenticity: The New Fame” అనే టాపిక్‌పై మాట్లాడారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, చేసిన తప్పులు, ఎదుర్కొన్న విమర్శలు, నేర్చుకున్న పాఠాల గురించి ఓపెన్‌గా మాట్లాడారు.

Also Read : Ravi Teja : ట్విటర్ ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మాస్ రాజా..!

సమంత మాట్లాడుతూ “కెమెరా ముందు జవాబుదారీగా ఉండటం చాలా కష్టం. ఇది ఒక ఫైనల్ డెస్టినేషన్ లాంటిది కాదు, ఇంకా నేర్చుకుంటున్న ప్రయాణం లాంటిది. నా జీవితంలో చాలా విషయాలు సరి చేసుకోవాల్సి ఉంది. వాటిపై మాట్లాడటం కూడా నాకు అవసరం అనిపించింది, నేను పర్ఫెక్ట్ కాదు. నా నిర్ణయాలు తప్పుగా ఉండి ఉండవచ్చు. వాటి ప్రభావం నా జీవితం పై తీవ్రంగా పడింది. కానీ ఇప్పుడు నేను వ్యక్తిగతంగా, ప్రొఫెషనల్‌గా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజంట్ నా జీవితంలో ఉన్న వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పలేను. నాకు తెలిసిన విషయాలను, వాస్తవాలను చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పక మాట్లాడుతాను. నా లైఫ్‌ని దగ్గరగా చూసిన వాళ్లకు, నా పరిస్థితి, నా బాధలు అర్థమవుతాయి” అని ఆమె చెప్పింది. అలాగే,

విడాకుల తర్వాత తనపై సోషల్ మీడియాలో జరిగిన విమర్శలు, ట్రోలింగ్ గురించి కూడా సమంత ఆవేదన వ్యక్తం చేసింది.. “నా డైవోర్స్ విషయాన్ని కొందరు పండుగ చేసుకున్నారు. నాపై అనేక రకాలుగా కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో నన్ను ఎంతగా ట్రోల్ చేశారో నాకు తెలుసు. కానీ ఈ అన్నింటినీ నేను ఓర్చుకున్నాను. ఆ అనుభవాలు నన్ను ఇంకా బలంగా మార్చాయి. ఒక దశలో నేను పూర్తిగా విరిగిపోయాను. ఆ అనారోగ్యం నుంచి బయటపడటం చాలా కష్టం. కానీ ఆ ఫేజ్ నాకు కొత్త బలం ఇచ్చింది” అని సమంత గుర్తుచేసుకుంది. మొత్తానికి సమంత మాటల్లో ఉన్న నిజాయితీ, ఆత్మవిశ్వాసం, జీవితం పట్ల ఉన్న ధైర్యం మరోసారి ఆమెని ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకంగా నిలిపింది.

Exit mobile version