Site icon NTV Telugu

సమంత లైఫ్ లో మ్యాజిక్… కొత్త పిక్ తో రివీల్ !!

Samantha

సమంత రూత్ ప్రభు లైఫ్ లో ఇప్పుడు మ్యాజిక్ జరుగుతోందట. తాజాగా షేర్ చేసిన పోస్టులలో సామ్ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌ విహారయాత్రలో ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సామ్ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ అవుతోంది. ఆదివారం సాయంత్రం ఈ బ్యూటీ పంచుకున్న పిక్ లో జీన్స్‌తో పాటు నలుపు రంగు క్రాప్ టాప్ ధరించింది. పోనీటైల్‌ వేసుకుని ఫొటోకు ఫోజిచ్చింది. తన హాలిడే డెస్టినేషన్‌లోని సుందరమైన ప్రదేశాన్ని చూస్తూ సామ్ ఎంజాయ్ చేస్తోంది. ఈ పిక్ కు సమంతా తెలుపు రంగు హార్ట్ ఎమోజీతో “దీనికి అలవాటు పడవచ్చు” అని రాసింది. ఆమె ఫోటోను పోస్ట్ చేసిన వెంటనే కామెంట్ల వర్షం కురిసింది.

Read Also : “భీమ్లా నాయక్” ఫస్ట్ రివ్యూ… హైలెట్స్ ఇవేనట !

ఇక అంతకుముందు సమంత తన స్కీయింగ్ అనుభవాన్ని అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. స్నో స్పోర్ట్‌లో ఆడుతున్న వీడియోను, స్విట్జర్లాండ్‌లోని మంచు పర్వతాలలో తాను ఉన్న చిత్రాన్ని కూడా షేర్ చేసింది. “4వ రోజు మ్యాజిక్ జరుగుతుంది. #skiingainteasybutitsureisfun” అంటూ ఆ ఫోటో గురించి రాసుకొచ్చింది. ఇక సామ్ ప్రస్తుతం దేవ్ మోహన్‌తో నటించిన ‘శాకుంతలం’ విడుదల కోసం వేచి చూస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత టైటిల్ రోల్ పోషిస్తోంది.

Exit mobile version