Site icon NTV Telugu

Samantha Ruth Prabhu: వెనక్కి తగ్గా, ఔట్ అవ్వలేదు.. సమంత పోస్ట్ వైరల్

Samantha Post Viral

Samantha Post Viral

Samantha Post Going Viral On Social Media: సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సినీ తారల్లో సమంత ఒకరు. సినిమాకు సంబంధించిన అప్డేట్స్‌తో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా రెగ్యులర్‌గా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలాంటి సమంత.. కొంతకాలం నుంచి యాక్టివ్‌గా లేదు. చివరిసారిగా సెప్టెంబర్ 23న తన సినిమా గురించి ఒక పోస్ట్ పెట్టిన ఈ భామ, ఆ తర్వాత నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఓవైపు సర్జరీ అంటూ, మరోవైపు అనారోగ్యానికి గురైందంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నా.. సమంత నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో.. ఏమైందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది.

ఇలాంటి తరుణంలో.. సమంత లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా పెట్టిన పోస్ట్ ఒకటి చర్చనీయాంశం అవుతోంది. దిండు వెనకాల దాక్కున్న తన పెంపుడు కుక్క ఫోటో పెట్టి.. ‘‘వెనక్కి తగ్గా కానీ ఓడిపోలేదు’’ (Down But Not Out) అని క్యాప్షన్‌ రాసింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత సమంత పోస్ట్ పెట్టడం, అది కూడా క్యాప్షన్ దయనీయంగా ఉండటం చూసి.. కొందరు సెలెబ్రిటీలు స్పందించారు. ‘‘మోర్‌ పవర్‌ టు యూ, ధైర్యంగా ఉండు’’ అని అర్థం వచ్చేలా ఎమోజీలతో కామెంట్స్‌ పెట్టి, ఆమెలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. అటు.. అభిమానులు కూడా ‘ఏమైంది మేడమ్, ధైర్యంగా ఉండండి’ అంటూ ధైర్యం చెప్తున్నారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి సమంత ఈ విధంగా పోస్ట్ పెట్టి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఈ అమ్మడు మరింత జోరు పెంచింది. ఓవైపు వెబ్ సిరీస్‌లతో పాటు మరోవైపు వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తోంది. బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఆమె చేస్తోన్న సినిమాల్లో ‘యశోద’, ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

Exit mobile version